మామయ్య మెట్ట వేదాంతము 101

 


మామయ్యా, అదేదో సిన్మాలో  Detached Attachment అనో ఏదో చెబుతారు. బావుంది కదూ ఆ మాట? 


Detached Attachment అయినా Attached Detachment అయినా అందరూ ఈదాల్సింది అదే సంసారం అల్లుడూ! 

నువ్వు ఎప్పుడూ భలే వేదాంతం చెబుతావు మామయ్యా! 

వేదాంతం జీవితానికి చవనప్రాసలాంటిది  అల్లుడూ! 
అర్థం పర్థం లేని మన బతుకులకు చుక్కానిలాంటిది వేదాంతం!

నీకేం కష్టం మామయ్యా, వేదాంతాలు చెబుతావు? 

అదంతేరా! అలాగే చెప్పాలి. 

చదువులో ఏముందండీ సంస్కారం ఉండాలి గానీ! అనాలి.
డబ్బులో ఏముందండీ, పోయేటప్పుడు కట్టుకు పోతామా! అనాలి. 
ఇవన్నీ నువ్వు బాగా చదువుకుని, బాగా డబ్బు సంపాదించాక చెప్పాలిరోయ్‌! అవేవి లేకుండా చెబితే అందరూ నవ్వుతారు. సరేనా? 

హహ, భలేగా చెబుతున్నావ్‌ మామయ్యా! 

ఇంకా విను. అందంలో ఏముందీ, కొరుక్కు తింటామా అనాలి. అలా అంటున్నాం కదా అని అందంగా తయారవకుండా ఉండకూడదురోయ్‌! 
అలాగే పైకి అనాలి గానీ అందమైన పిల్లనే చేసుకోవాలి! తెలిసిందా? 

హహ్హహ్హ! ఏం చెప్పావ్‌ మామయ్యా! 

నాకేమీ కీర్తికాంక్ష లేదండీ. కామ్‌గా నా పనేదో నేను చేసుకుంటూ పోతుంటా అనాలి. కానీ పేరొచ్చే పనులే చెయ్యాలి. తెలిసిందా? 

భలే బావుంది మామయ్యా! ఇంకా చెప్పు. 

నేను ఎంతోమందికి గుప్తదానాలు చేసా. కానీ ఎవ్వరికీ చెప్పుకోను. 
కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియనివ్వను. మీకొక్కళ్ళకే చెబుతున్నా. మళ్ళీ ఎవరితోను అనకండి అనాలి. ఇల్లాగే అందరికీ చెబుతూ ఉండాలి. తెలిసిందా? 

హహ, ఏం తెలివి మామయ్యా! 

ఏముందండీ అంతా మాయ! అని పైకి అనాలి.
 కానీ, చూసావూ, అందరికీ ఆ మాయే కావాలి. 
మనకూ ఆ మాయే కావాలి.
 అదీ సంగతి. 

హహ, మాయ అంటే అమ్మాయా మామయ్యా! 

నీకు ఇంకా చిన్నతనం పోలేదురా. నా అంతటి గొప్ప వేదాంతివి ఎప్పటికవుతావో మరి! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు