బాబాజీ మాయ!

 


ఏమిటండీ ఈ దారుణం?
చూసారా మీరు?  దేవీ నవరాత్రుల్లో ఆ బాబాజీ విగ్రహానికి విగ్గు,సవరం పెట్టి అమ్మవారిలాగా తయారు చేసి కూచోపెట్టారు! 🙄

పోనీలెండి, బాబాజీలో అమ్మవారిని చూస్తున్నారు. వదిలెయ్యండి.😀

ఏమిటండీ వదిలేసేది? చూస్తూ ఉంటే వెర్రి ముదిరిపోతున్నది. 
అయినా ఆ బాబాజీ ఎప్పుడు తన మతం దేవుడినేగా తలచుకున్నది?
ఆయన్ను అమ్మవారిని చేసి కూచోబెట్టడం ఏమిటండీ? 😔

భగవంతుడిని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చునని వాళ్ళు అలా ప్రొసీడవుతున్నారు. వదిలెయ్యండి. 😄

అది కాదండీ, హిందూ దేవీ దేవతల్లో ఏ రూపంతోనైనా ఆరాధించమని కదా మనవారు చెప్పింది? వేరే మతం దేవుళ్ళని, వేరే మతం బాబాలను తెచ్చి మనం పూజించడం ఏమిటండీ? 😠

పోనీలెండి, పూజించుకోనివ్వండి. మనకేం నష్టం.😁

పూజించుకోనివ్వడం కాదండీ. ఇప్పుడసలు మామూలు గుళ్ళకి, ప్రాచీన దేవాలయాలకు వెళ్ళడం తగ్గిపోయింది. ఎవరి నోట చూసినా బాబాజీయే. ఆయనే రాముడుట, శివుడుట, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడట. ఇప్పుడు కొత్తగా అమ్మవారిని కూడా చేసారు. ఎక్కడిదాకా పోతోందండీ ఈ వెర్రి? 🤯

కొంచెం ఎక్కువ చేస్తున్నారనుకోండి. ఇది వరకు ఓ సాంప్రదాయానికి చెందిన పరంపరలో గురువుగా చెప్పేవారు. ఇప్పుడు భగవంతుడిని చేసేసారు. చాలా కథలు,చరిత్ర పారాయణాలు, బాబాజీ గాయత్రులు అన్నీ గత పాతికేళ్ళలోనే ఉధృతంగా ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఏమీ లేదండీ.😊

అలాంటి గురువులు మనకు బోల్డు మంది ఉన్నారు కదండీ? వారిని ఎవరినీ మనం భగవంతుడిని చెయ్యలేదే?
అయితే మొత్తం ధర్మాన్ని కలుషితం చేస్తుంటే చూస్తూ కూచోవడమేనా
చేతులు ముడుచుకుని? గల్లీ గల్లీకి బాబాజీ మందిరాలే! మీలాంటి వారికి చెబితే ఉదాసీనత. అందరూ నిర్లిప్తంగా కూచుంటే ఎలాగండీ? 
మా బంధువుల్లో ఎవరు చూసినా బాబాజీ భక్తులే. పొద్దున్న లేస్తే బాబాజీ భజనలు. పైత్యం. పైత్యం.పైత్యం. మన భగవద్గీత, ఉపనిషత్తులు, మన ఇతిహాసాలు ఎటు పోయాయో? ☹️

అవన్నీ పైస్థాయిలో ఆలోచించిన మన పూర్వీకులకి. ఇప్పటి తరం మెజారిటీ హిందువులకి కావలసింది లౌకికమైన కోరికలు తీరడం. అవి ఎవరు తీరుస్తారని ప్రచారం జరిగితే అలా ఆవైపుకు వెళ్ళిపోతారు. అదీ సంగతి. 😁

అలా ఎటుబడితే అటు వెళ్ళిపోవడం ఏమిటండీ? అయినా అసలు హిందూధర్మాన్ని కబళించే స్థాయిలో పెరిగిపోతేనూ ఇదంతా? చాలా బాధగా ఉందండీ నాకైతే. 🥺

మీ బాధ నాకర్థం అవుతోంది. ఇదింతలా ఎందుకు పెరిగిందో చెబుతా  వినండి.బాబాజీ గుడి కట్టారనుకోండీ, ఇప్పుడున్న చట్టాల ప్రకారం అది దే.ధ.శాఖ క్రిందకు రాదు. అంటే దాని మీద వచ్చే ఆదాయం వెళ్ళేది ప్రభుత్వానికి కాదు, కమిటీ వారికి. ఈ భక్తిని ఎన్నిరకాలుగా ప్రచారం చేస్తే అంత లాభం. ఇప్పుడర్థమైందా? 😀


ఓ! ప్రజల ఎమోషన్సుని, చట్టంలో లొసుగుల్ని వాడుకుని ఆధ్యాత్మిక వ్యాపారం చేస్తున్నారా? 🥵

సరిగ్గా పట్టారు. ఇప్పుడు మీరు కూడా మీ ఆవేశాలను పక్కన పెట్టి దీన్ని ఎలా ఎదుర్కో వచ్చో ఆలోచించండి. ఎదుర్కో లేము అనుకుంటే మీరు కూడా బాబాజీకి గుడి కట్టి లాభం పొందండి. 😎



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5