ఇల్లు అద్దెకు ఇవ్వబడదు!

 


కష్టపడి ఇన్నాళ్ళకి ఇల్లు కట్టుకున్నావ్‌. 

పక్క వాటా అద్దెకు కూడా ఇచ్చినట్టున్నావ్‌?

ఏదోలేరా. నా కష్టాలు నీకేమి తెలుసు?

అదేమిటీ అంత నిరాశగా మాట్లాడుతున్నావ్‌? 

నీకు తెలుసుగా, నేనొక అభ్యుదయవాదినని. మా ఆవిడ ఎంత చెప్పినా వినకుండా వేరే మతం వాళ్ళకి అద్దెకిచ్చా. వాళ్ళేమో మైకులు పెట్టి మత ప్రచారం చేస్తూ ఒకటే గోల. వాళ్ళని ఖాళీ చేయించేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చింది!

అయ్యో! అలాగా!

అయినా నాకు బుద్ధి రాలా. నేను అభ్యుదయవాదిని కదా. 
ఈసారి ఇంకో కులం వాళ్ళకి ఇచ్చా. వాళ్ళు ఆర్లెల్లైనా అద్దె ఇవ్వకుండా అద్దె అడగడానికి వెళితే నామీద  వేధింపుల కేసులు పెడతామని బెదిరించారు. నేనే ఎదురు డబ్బులుచ్చి వాళ్ళను ఒదిలించుకోవాల్సి వచ్చింది! 


అయ్యో! అలాగా!

ఈసారి మా ఆవిడ మాట విని మన వాళ్ళకే ఇచ్చా. వాళ్ళు మన వాళ్ళే కానీ నాస్తికులు, వామపక్షులుట. ఆచారం లేకపోతే పోయె మా పిల్లలకి లేనిపోనివన్నీ నేర్పి వాళ్ళను ఉద్యమాల్లోకి చేరమని ప్రోత్సహిస్తుంటే ఇదేదో మన పుట్టి ముంచేట్టుందని అడవుల్లో అక్కలతో మాట్లాడి నానాతిప్పలు పడి వాళ్ళని ఖాళీ చేయించా! 


అయ్యో! అలాగా!

అవున్రా.  ఈ బాధలన్నీ పడ్డ అనుభవంతో “ ఇల్లు అద్దెకు ఇవ్వబడును. ఆచారాలను గౌరవించే సంప్రదాయబద్ధమైన మా కులానికి చెందిన కుటుంబానికి మాత్రమే.” 
అని బయట బోర్డు పెట్టా. 

మంచి పని చేసావ్‌! 

ఆగాగు, ఇంకా ఉంది. 
ఆ బోర్డు ఫొటో తీసి ఎవడో ఫేసుబుక్కులో పెట్టాడు! 
నేను కులోన్మాదినని, మతోన్మాదినని ఒకటే ట్రోలింగు! 
ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. 

అదా సమస్య. ఆ బోర్డులోనే ఇది కూడా రాయించు:

“నా ఇల్లు ఎవరికి అద్దెకివ్వాలో నా ఇష్టం. అది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు” అని. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు