ఎర్ర సాంబారులో కరివేపాకులు

 


ఇంకా మహాకవి అరుణశ్రీ, హలాహలం,కవి సామ్రాట్టు,ఎర్ర రావి రచనలే చదవడం కుట్ర అంటున్నారు. విన్నావా?

విన్నా.  సాహితీ బజారులో వీళ్ళ నాసిరకం సరుకు కాల పరీక్షకు నిలబడదన్న సంగతి గ్రహింపుకు వచ్చి దిగులు పుడుతున్నట్టుంది పాపం. అదీ అసలు భయం. 😀

అది కాదు, ఈ జాబితాలో కవి సామ్రాట్టు ఎందుకొచ్చాడు?
మిగతా వాళ్ళ పేర్లు మాత్రమే వ్రాస్తే కవి సామ్రాట్టు టైపు సాంప్రదాయ రచనలు చదవమన్న అర్థం వస్తుందనా? 

 కావచ్చు. ఆ జాబితాలో ఉన్నవారందరికీ ఒక కామన్‌ పాయింట్ ఉంది చూడు. వారంతా బ్రాహ్మణులు!

ఓ! అయితే వారి దృష్టిలో జంధ్యామార్కుల వారన్న మాట. వారి రచనలు చదవొద్దంటున్నారా?  అది సరే, కానీ సామ్రాట్టు తప్ప మిలిగిన వారంతా కరుడు గట్టిన వామపక్షం వారేగా? అంటే వారి తరఫున మాట్లాడిన వారేగా? వారి రచనలు చదవొద్దని ఎలా అంటారు? 

ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణ వామపక్షమట! 

అదేమిటి?

అదంతే. ముందు అగ్రవర్ణం వారిని వారి ఎడమ ఉద్యమాల్లోకి ఆకర్షించి, వారి శక్తిని, తెలివిని ఆ ఉద్యమాలు బలపడడానికి వాడుకుంటారు. 

తర్వాత?

తరువాత అదే అగ్రవర్ణం అన్న పాయింటును వాళ్ళను విమర్శించడానికి, బయటికి తొయ్యడానికి వాడుకుంటారు!

అసలు ఎవరి రచనను చదవడమైనా కుట్ర ఎలా అవుతుంది?

వారి రచనలు, సిద్ధాంతాలు వాటి గురించి కాదు, వారు అగ్రవర్ణ రచయితలు కనుక వారి రచనలు వీరు చదవాల్సి రావడం, చర్చించాల్సి రావడం “కుట్ర” అన్న మాట!

చదవడం కుట్ర అన్న తర్వాత ఏం చేస్తారు?

మన వాళ్ళు రాసినవి మాత్రమే చదవాలి, చర్చించాలి అంటారు. అలా పేరు మోసిన అగ్రవర్ణ రచయితలను పక్కకు తప్పించాలి! ఎవరైనా ఆయా రచనలను ఉటంకించబోతే, నువ్వు అగ్రవర్ణ అహంకారివని అంతా కలిసి వాడిని కరవాలి! అదీ ఎజెండా. 

ఏమిటో అంతా కొత్తగా ఉంది!

కొత్త ఏమీ లేదు. అన్నిచోట్లా అదే modus operandi. 

ముందు నన్నయ, తిక్కన లాంటి పాత తరం కవులను చదవడం మూర్ఖత్వం, సంకుచితం అని ప్రచారం చేసి వారిని దూరం చేసారు. ఇప్పుడు తరువాతీ తరానికి వచ్చారు. 

అయ్య బాబోయ్‌! ఇంత ఉందా? 

మరేమనుకున్నావ్‌? అయినా సనాతనాన్ని వదిలి పెట్టి తమ రచనాకౌశలాన్ని left turn తిప్పుకున్న అరుణశ్రీ, హలాహలం,ఎర్ర రావి లకు ఈ శాస్తి జరగాల్సిందే! 

అంతేనంటావా?

అంతేగా.అంతేగా. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5