Dynamics of Thermodynamics

 



Engineering లో Thermodynamics చదివావుగా? 

ఆ, చదివాగా. Interesting subject!

ఇప్పుడు కేవలం Thermodynamics మీద పరిశోధన చేసి అందులోని లోతుపాతుల మీద పేపర్లు వ్రాసావనుకో, నువ్వు మామూలు మేధావివి!

ఓహో! కొత్తగా ఉందే?

అవును. అదే పిడకలు కొట్టడంలో Thermodynamics, సాంబారు కాయడంలో Thermodynamics అని పేపర్లు వ్రాసావనుకో, 
నువ్వు ఓ మాదిరి మేధావివి!

భలే! సరదాగా ఉందే!

ఇంకా విను. 
  నీ చేతులు చల్లన, నీ హృదయం వెచ్చన, అమ్మ కడుపు చల్లగా, భగ భగ మండే హృదయం ఇలాంటివి “ ఉష్ణోగ్రత” మీది పాటలు తీసుకుని,  “సినిమా పాటల్లో Thermodynamics” అని పుస్తకం వ్రాసావనుకో, నువ్వు సాహితీ మేధావివి! 

హహ! బావుంది! 

ఇంకా చెబుతా విను. నువ్వు మహా మహా మేధావివి అనిపించుకోవాలంటే, Thermodynamics బోధించే ప్రొఫెసర్లు దేశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ ఏ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళో లెక్క సంపాదించి, ఇదిగో ఫలానా “ముందు బడిన” సామాజిక వర్గం వాళ్ళే Thermodynamics ని ఆక్రమించేసారు అని పేపరు వ్రాస్తే వెంటనే అమ్యూనిస్ట్ మేధావులంతా ఆ పేపరుకు అంతర్జాతీయంగా విఖ్యాతి కలిగించి నిన్ను మహా మహా మేధావిని చేసేస్తారు!

Interesting!

అదే Thermodynamics బోధించే వారు ఎక్కువ శాతం మగవారే, ఆడవారికి ఇక్కడ కాపర్‌ సీలింగ్‌, బ్రాంజ్‌ సీలింగ్‌ ఉంది అని పేపరు వ్రాస్తే అంతర్జాతీయ ఎమినిస్ట్ అనలిస్టులంతా మెగా మెగా మేధా దేవిని  చేస్తారు! 

హహ! బావుంది! 

ఇంకా Thermodynamics + economics కలిపి, కేవలం ధనికులే ఏసీలు, హీటర్లు వాడగలుగుతున్నారని బీదల మేధావిగా పేపరు వ్రాసి పేరు మారుమోగించుకోవచ్చు. ఆ వాడే వారిలో ఫలానా కులం వారే ఎక్కువ అని పేపరు వ్రాసి అక్కసు తీర్చుకొని మెల్లగా చల్లగా మేధావి కావొచ్చు! 


ఓరి దేవుడో! Thermodynamics లో ఇన్ని Dynamics ఉన్నాయని తెలియదు సుమీ! 

ఇంకా చెబుతా విను. 


Thermodynamics + Politics తో రాజ్యాలను వేడెక్కించవచ్చు!

ఇంకా Thermodynamics + … 

ఆపరా నాయనా, నీ ఐడియాలతో బుర్ర వేడెక్కిపోతోంది!

హహ, Energy cannot be created or destroyed అని first law of thermodynamics తెలీదూ? 

ఏడిసావ్‌లే! For a spontaneous process the Entropy of the Universe increases అని Second law of thermodynamics నీకు మాత్రం తెలీదూ? 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5