రథచక్రాల్‌ లాగలేని పాంథుడు! ‌

 


అటు చూస్తే

కమ్యూనిస్టు

ఇటు చూస్తే

కాపిటలిస్టు

చూడు చూడు

నడి మధ్యన

రెండు శ్రీ ల

కవిత్వాల మేస్త్రీ

అక్షరాల పలాస్త్రి! 


ఆ ఇస్టుకు 

ఈ ఇస్టుకు

ఇద్దరికీ 

ఇష్టుడే!

పదాల 

పోహళింపులో

అందరికీ 

ఆప్తుడే! 


జగన్నాథు

 రథంలో

జగన్నాథు 

ఆశీస్సుల్‌

కానలేని 

కామ్రేడే!

జగన్నాథు 

బలంలో

జగన్నాథు 

రథచక్రాల్‌

లాగలేని 

పాంథుడే!


చూడు చూడు

నడి మధ్యన

రెండు శ్రీ ల

కవిత్వాల మేస్త్రీ

అక్షరాల పలాస్త్రి!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు