పోస్ట్‌లు

ఆగస్టు, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అంచెలంచెలు లేని మోక్షము చాన కష్టము సోదరా!

  చిన్నప్పుడంతా కిందకే చూస్తుండే వాడిని. ఎందుకు? తల వంచుకుని పుస్తకాలు చదవడం,బొమ్మలు గీయడం చేత!  ఓహో! తర్వాత? యవ్వనంలో ఎటెటో చూస్తుండే వాడిని. ఎందుకు? భావుకత పొంగులు వారుతూ ఉండడం చేత! ఓహో! తర్వాత? తర్వాత నడి వయసులో అటూ ఇటూ చూసేవాడిని. ఎందుకు? స్నేహాల కోసం,పరిచయాల కోసం తహతహలాడడం చేత! ఓహో! సినిమా ఇంటర్వెల్‌కొచ్చినట్టుంది. ‌ ఇప్పుడెటు వైపు చూస్తున్నావ్‌?  ఇప్పుడు పైకి చూస్తున్నా. ఏముందీ పైన?? పైనంటే భగవంతుడి వైపురా! ఓహో! ఆధ్యాత్మికత! బావుంది.  అవును, మొన్ననే ఒక spiritual పుస్తకం రాసా.  నాకు మోక్షం గ్యారెంటీ! కానీ సమీక్షలు సరిగ్గా రాలేదు. నా పుస్తకాన్ని ఎవరూ గుర్తించ లేదు.  అందరికీ కుళ్ళే. ఒళ్ళు మండిపోయింది నాకు.  అయ్యో పాపం! అలాగా!  యోగా, ధ్యానం చేస్తున్నా. రోజూ దేవుడితో మాట్లాడుతున్నా.  ఇహ నాకు మోక్షం గ్యారెంటీ! కానీ ఆ యోగా టీచరు డబ్బు మనిషి. ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు.  వేరే యోగా టీచరు కోసం చూస్తున్నా.  ఓ! అలాగా!  రోజూ పూజలు రెగ్యులర్గా చేస్తున్నా.  నాకు మోక్షం గ్యారెంటీ! ఓ! అలాగా! బావుంది. అవునూ, హడావిడిగా ఎక్కడికీ పోతున్న...

ఎవ్వరైనా కానీవోయ్‌! - 2

  మరి కవి గారు ఈ కవిత ఎందుకు రాసినట్టు? చెబుతా విను.  తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?  అన్నది వినగానే నీ ఊహకు వచ్చేది ఏమిటి? ఎవరో వెనుకనుండి అదిలిస్తుంటే, కొరడా పట్టుకుని నిలబడితే పెద్ద పెద్ద బండరాళ్ళను మోస్తున్న బక్కచిక్కిన కూలీలు. అవునా? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌ అది మోసిన బోయీలెవ్వరు? అనగానే,  చేతి వేళ్ళనిండా ఉంగరాలతో, పెద్ద బొజ్జతో, పల్లకీలో ఓ ధనవంతుడు  సుఖంగా కూర్చుని ఉంటే పాపం డొక్కలెండిన కూలీలు  నలుగురు ఆ భారీకాయాన్ని మోస్తూ ఉన్న దృశ్యం. అవునా?  మేం రాళ్ళెత్తితేనే వీళ్ళకు భవనాలు, మేం పల్లకీలు మోస్తే వీళ్ళు వాటిలో దర్జాగా తిరుగుతున్నారు అని ఆ శ్రమజీవులకు అనిపిస్తుంది ఇది చదివితే. అవునా?  సరిగ్గా ఈ ఊహ రావాలనే,  చిరకాలం జరిగిన మోసం ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు! అని నినదిస్తున్నాడు మహాకవి.  అయితే ఒకటి ఆలోచించు.  కూలీలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇల్లు కట్టించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అంటే కూలీలకు పని లేదు. నిరుద్యోగం ప్రబలిపోయి ఉంది. ఆకలి కేకలు వినవస్తున్నాయి. అప్పుడు హఠాత్తుగా ఓ షరాబు ఓ పె...

ఎవ్వరైనా కానీవోయ్‌! - 1

  తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?  ఆహా! ఎంత బాగా చెప్పాడో కదా మహాకవి?  వినడానికి బానే ఉంది. కానీ లాజిక్‌ లేదు.  అదేంటి? అలా అనేసావ్‌?  ఆ అన్నది మహాకవి! కావొచ్చు. విషయం ఎవరన్నారని కాదు.  అసలు ఎవడైనా కూలీ పనికి ఎందుకు వెళ్తాడు? డబ్బు కోసం? కదా. వీడు శ్రమ ఇచ్చాడు, వాడు డబ్బిచ్చాడు.  అయిపోయింది లావాదేవీ.  డబ్బూ ఇచ్చి, పేరు కూడా కూలీకే ఇవ్వాలంటే ఎలా చెప్పు? దీన్నే కొంచెం వివరంగా చెబుతా విను. ఎవరైనా తాజ్‌ మహలో, రాజ్‌ మహలో ఎందుకు కట్టిస్తారు బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి?  పేరు కోసం!  కట్టిన వాడికి కూలీ, కట్టించిన వాడికి పేరు.  ఇప్పుడా డబ్బూ కూలీకి ఇచ్చి,  పేరు కూడా కూలీకే రావాలంటే  ఆ కట్టించే వాడు ఎందుకు కట్టించాలి?  ఇంకొంచెం వివరంగా చెబుతా విను.  చాలా డబ్బు ఖర్చు పెట్టి నువ్వో ఇల్లు కట్టించావనుకో. ఫలానా సుబ్బారావు గారిల్లు ఎంత బావుందండీ? అని ఎవరైనా అంటే, అబ్బే, ఆయనేమన్నా రాళ్ళెత్తడా? సిమెంటు మోసాడా? ఆ ఇల్లు కట్టింది మాఊళ్ళో కూలీలు. అంటే నీకెలా ఉంటుంది?  ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌ అది మోసిన బోయీలెవ్...