అంచెలంచెలు లేని మోక్షము చాన కష్టము సోదరా!

 


చిన్నప్పుడంతా కిందకే చూస్తుండే వాడిని.


ఎందుకు?

తల వంచుకుని పుస్తకాలు చదవడం,బొమ్మలు గీయడం చేత! 

ఓహో! తర్వాత?

యవ్వనంలో ఎటెటో చూస్తుండే వాడిని.

ఎందుకు?

భావుకత పొంగులు వారుతూ ఉండడం చేత!

ఓహో! తర్వాత?

తర్వాత నడి వయసులో అటూ ఇటూ చూసేవాడిని.

ఎందుకు?

స్నేహాల కోసం,పరిచయాల కోసం తహతహలాడడం చేత!


ఓహో! సినిమా ఇంటర్వెల్‌కొచ్చినట్టుంది.
‌ ఇప్పుడెటు వైపు చూస్తున్నావ్‌? 

ఇప్పుడు పైకి చూస్తున్నా.

ఏముందీ పైన??

పైనంటే భగవంతుడి వైపురా!

ఓహో! ఆధ్యాత్మికత! బావుంది. 

అవును, మొన్ననే ఒక spiritual పుస్తకం రాసా. 
నాకు మోక్షం గ్యారెంటీ!
కానీ సమీక్షలు సరిగ్గా రాలేదు. నా పుస్తకాన్ని ఎవరూ గుర్తించ లేదు. 
అందరికీ కుళ్ళే. ఒళ్ళు మండిపోయింది నాకు. 

అయ్యో పాపం! అలాగా! 

యోగా, ధ్యానం చేస్తున్నా. రోజూ దేవుడితో మాట్లాడుతున్నా.
 ఇహ నాకు మోక్షం గ్యారెంటీ!
కానీ ఆ యోగా టీచరు డబ్బు మనిషి. ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు. 
వేరే యోగా టీచరు కోసం చూస్తున్నా. 

ఓ! అలాగా! 

రోజూ పూజలు రెగ్యులర్గా చేస్తున్నా. 
నాకు మోక్షం గ్యారెంటీ!

ఓ! అలాగా! బావుంది.
అవునూ, హడావిడిగా ఎక్కడికీ పోతున్నావ్‌? 

ఫస్ట్ షో రాంభేష్ సినిమాకి! లేటవుతోంది వెళ్ళొస్తా! 


నీ మోక్షానికి నాదీ గ్యారెంటీ! వెళ్ళి రా! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

కుబెగ్గరేరా!