అర నిమిషం-కొర నిమిషం


అర నిమిషం

కొర నిమిషం

అర కొర

అర కొర

కొర నిమిషం


ఎలకలు ఉన్నాయా ఇంట్లో?

అవును!అవునుఅవును

ఎప్పుడు వచ్చిందోనోయమ్మా!

ఎప్పుడు పోయిందోనోయమ్మా!

ఏమి కొరికికెనో ఏమోయమ్మా!


అర నిమిషం

కొర నిమిషం

అర కొర

అర కొర

కొర నిమిషం


ఢమఢమ చప్పుళ్ళేమోనమ్మా

కిరుకిరు శబ్దాలేమోనమ్మా

కలుగులో కిలకిలలేమోనమ్మా!


అర నిమిషం

కొర నిమిషం

అర కొర

అర కొర

కొర నిమిషం


ఉడతలు ఉన్నాయా దొడ్లో?

అవును!అవును!అవును!


కొమ్మ కొమ్మకి దూకిందమ్మా

జామ చెట్టు పై చేరిందమ్మా

పండు పండునూ కొరికిందమ్మా

ఎలుక చేతిలో జున్నును చూసి

పకపకపక నవ్విందమ్మా!


అర నిమిషం

కొర నిమిషం

అర కొర

అర కొర

కొర నిమిషం!



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన