తెలివిడి సిడిముడి



 వదలని వరుసల

తలపులు కదపక

మునుగక తికమక

అటుఇటు పరుగిడు

వలపుల ముడిపడు

గిడగిడలాడెడు

మెదడుల ఆటలు

వలదని వలదని

తైతక తైతక


మమతల మూతలు

బిగిసిన గడియలు

బిడియపు ఉడుపులు

వదలని అప్పులు

ఒప్పని తప్పులు

తప్పని ముప్పులు

తైతక తైతక


విరుపుల మాటలు

తడితడి మూటలు

అసూయ కణుపులు

ఆరని కణికలు

టింకర వంకర

గర గర పొలుసులు

తైతక తైతక


ఇడుముల తడబడు

తెలివిడి సిడిముడి

వడి వడి విడివడి

జారెడు పాయల

ఆడెడు నటనల

ఉడకని పలుకులు

విడు విడు విడు విడు

విడు విడు విడు విడు

తైతక తైతక

తైతక తైతక

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన