ఆమె

 


ఆమె ఉల్లాసాన్ని

ఉడుపులుగా 

ధరించి వచ్చింది

వారు ఆమెను 

బాధించలేక పోయారు


ఆమె వైరాగ్యాన్ని

చేత పట్టుకు వచ్చింది

వారు ఆమెను

బంధించలేక పోయారు.


ఆమె వినయాన్ని

వెంట పెట్టుకు వచ్చింది

వారు ఆమెను

వేధించలేక పోయారు.


ఆమె జీవితాన్ని

తపస్సుగా మార్చుకుంది

వారు మూతులు 

తిప్పుతూ

తొలగిపోయారు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కుబెగ్గరేరా!

ఎవ్వరైనా కానీవోయ్‌! - 1

అవార్డులొచ్చే కవిత్వం రాయడం ఎలా? - 4