తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? ఆహా! ఎంత బాగా చెప్పాడో కదా మహాకవి? వినడానికి బానే ఉంది. కానీ లాజిక్ లేదు. అదేంటి? అలా అనేసావ్? ఆ అన్నది మహాకవి! కావొచ్చు. విషయం ఎవరన్నారని కాదు. అసలు ఎవడైనా కూలీ పనికి ఎందుకు వెళ్తాడు? డబ్బు కోసం? కదా. వీడు శ్రమ ఇచ్చాడు, వాడు డబ్బిచ్చాడు. అయిపోయింది లావాదేవీ. డబ్బూ ఇచ్చి, పేరు కూడా కూలీకే ఇవ్వాలంటే ఎలా చెప్పు? దీన్నే కొంచెం వివరంగా చెబుతా విను. ఎవరైనా తాజ్ మహలో, రాజ్ మహలో ఎందుకు కట్టిస్తారు బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి? పేరు కోసం! కట్టిన వాడికి కూలీ, కట్టించిన వాడికి పేరు. ఇప్పుడా డబ్బూ కూలీకి ఇచ్చి, పేరు కూడా కూలీకే రావాలంటే ఆ కట్టించే వాడు ఎందుకు కట్టించాలి? ఇంకొంచెం వివరంగా చెబుతా విను. చాలా డబ్బు ఖర్చు పెట్టి నువ్వో ఇల్లు కట్టించావనుకో. ఫలానా సుబ్బారావు గారిల్లు ఎంత బావుందండీ? అని ఎవరైనా అంటే, అబ్బే, ఆయనేమన్నా రాళ్ళెత్తడా? సిమెంటు మోసాడా? ఆ ఇల్లు కట్టింది మాఊళ్ళో కూలీలు. అంటే నీకెలా ఉంటుంది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్...