మెరుపు




ఆరడుగులు పైకిలేచి
ఆగి ఆగి ఊగుతోంది
నల్ల తాచు

అలల మీది ఓడలా
తూగి తూగి వాలుతోంది
గడ్డి పోచ


ఉండుండి గంతేసి
వెర్రిగా పరుగెడుతోంది
తుఫాను గాలి

కాటుక కాయ నింగి చీలి
కన్ను చెదిరే కాంతి కురిసి
వెలుగుతున్నవి

నల్ల తాచు
గడ్డి పోచ

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కుబెగ్గరేరా!

ఎవ్వరైనా కానీవోయ్‌! - 1

అవార్డులొచ్చే కవిత్వం రాయడం ఎలా? - 4