చూపు



ఎముకలకి 

చర్మాన్ని తొడిగిన  

ఒంటిని 

ఆ ఒంటిని 

అలంకరించిన 

మాసికల చొక్కాని      

రిక్షా తొక్కి తొక్కి 

నెర్రెలు విచ్చిన 

బతుకుని చూసి  


చేప కళ్ళ  

కొస కంట 

జాలి చుక్క 

విడిచి 

గిరుక్కున తిరిగి

పోబోతుంటే 

ఆమె


కాలుతోన్న బీడీని 

పొగ చూరిన 

పెదాల కింది 

గారపళ్ళతో  బిగించి 

గుంట కళ్ళు చికిలించి 

పిల్ల చెక్సీగా ఉన్నాది  

అన్నాడు 

వాడు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన