దిన పత్రిక
ఇది రాత్రంతా నిద్ర పోదు
ఉదయాన్నే పేజీ పేజీకి
వేయించిన అప్పడాల్లాంటివి
వేపాకు పచ్చడిలాంటివి
సున్నుండల్లాంటివి
జీడి పాకంలాంటివి
వార్తలు పట్టుకొస్తుంది.
తెల్లారితే ఇది ఇక
నిద్రే పోతుంది
పేజీ పేజీకి
సాలె గూళ్ళే ఉంటాయి
సాలె గూళ్ళల్లో
చచ్చిన సాలీళ్ళు.