ప్రాక్‌ జ్యోతి ఛాయలు



ఆలోచనలు
చీకటి చెఱువులో
గుర్రపు డెక్కవలే
దుంప వేసి
వ్యాపించి ఉన్నవి

చూరు
పట్టుకు
గబ్బిలాల్లా
తల్లకిందులుగా
వేళ్ళాడుతున్నవి
వదంతులు

లోకులతో స్నేహాలు
బులబులాగ్గా
బురదలాగా
కాళ్ళను కిందకి
లాగుతున్నవి

తుమ్ము ముళ్ళల్లా
చెప్పుల్లోనూ
ఇరుక్కుని
ఇంటి దాకా
వస్తున్నవి
లౌకికాలు

అనేకానేక
జ్ఞాపకాల 
ఖండికలు

సూర్యుడు రాని
చంద్రుడు పోని
ఆకాశాలు 

బాధాప్లావితాలవి

రాగరంజిత
స్వప్న శకలాల వెనుక
ప్రాక్‌ జ్యోతి ఛాయలు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన