తెలుగు మహాభారతానికిది సహస్రాబ్ది!

 


మల్లెలు
తురిమిన
పూలజడ
తరహా

పసుపు
పచ్చని
ఛాయ
బంగారు
వరహా

అలతి
పదముల
చిత్రిక
చెవినిల్లు
సలహా

దేశభాషా
దేవతల
తెలుగే
అహిహా

వన్నె చిన్నె
పలుకుల
ఊహలల
అతిరుహా

హాహా
హూహూ
జిహ్వాన
అచ్చ తెనుగే
అహహా!

అన్ని
పలుకులందు
తెలుగు పలుకే
మహా!
మినహా!

అహా!
తెలుగు
ఓహో!
తెలుగు
వహ్వా!
తెలుగు

తెలుగే
తెలుగు!
ఇరుదలపులుగు!

(తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్న తెలుగు జాతికి శుభాకాంక్షలు). 💐🙏

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి