క్లిక్‌.. క్లిక్‌


మా ఆవిడతో సిన్మాకొచ్చా. ఫొటో తియ్యి బాబు. ఫేస్‌బుక్‌లో పెట్టి అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి.


క్లిక్‌.. క్లిక్‌

నాకు ఎన్నో మానసిక సమస్యలున్నాయి. డాక్టర్‌ గారి మందు చీటీతో దుప్పటి కప్పుకుని ఉన్న నా ఫొటో తీసి ఫేస్‌బుక్‌ లో పెడితే లైకులతో, కామెంట్లతో నా మనసుకి కాస్త ఊరట వస్తుంది.

క్లిక్‌.. క్లిక్‌

రోజుకో చీర కట్టి ఫేస్‌బుక్‌లో పెట్టడం నా అలవాటు. ఈ వంకాయ మొక్కల దగ్గర వంగపండు చీర కట్టుకున్న నన్ను ఫొటో తియ్యి బాబు. ఫేస్‌బుక్‌లో పెట్టుకుని అందరి అభినందనలు పొందాలి.

క్లిక్‌.. క్లిక్‌

ఇవాళ పోయినాయిన కర్మ చేస్తున్నాం. ఫొటోలు తియ్యి బాబు. ఫేస్‌బుక్‌ లో పెట్టి వచ్చిన కామెంట్లను పోయినాయిన చెవిలో చదివితే ఆయనకు ఆత్మశాంతి.

క్లిక్‌.. క్లిక్‌

వీడెవడో ఫొటో తీయమని చెవి కోసిన మేకలా అరుస్తున్నాడు. వాడికో ఫొటో తియ్యి బాబు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన