రామ!రామ!


 రామాయణం మీద తాతాచారి వెర్రిమొర్రి వ్యాసాలు చదివి స్వర్గంలో ఉన్న బాపు గారు కన్నీరు పెట్టుకున్నారు. బొమ్మ గీద్దామంటే కుంచె కదలక తానే స్వయంగా భూలోకానికి దిగి వచ్చి, ఏమిటండీ ఈ రాతలు? అని అడిగారు గద్గద స్వరంతో.


తాతాచారి: హిహ్హిహీ, బాపు గారు, మీరా?  చదివారా? రామాయణంలో మీకు తెలియని కొత్త కోణాలు ఆవిష్కరించా. చూసారా?

బాపు: రామ!రామ!

తాతాచారి: రామాయణం అంతా ఆర్య-ద్రావిడ;బ్రాహ్మణ-అబ్రాహ్మణ; స్త్రీ-పురుష; వైదిక-అవైదిక గొడవలే అన్న వామపక్ష స్వామి మాటలను నా వ్యాసంలో ఉటంకించి నా బ్రహ్మద్వేషాన్ని చాటుకున్నా.

బాపు: రామ!రామ!

తాతాచారి: మొద్దు కిష్న రాసిన రామాయణంలో, రావణుడు సీతను ప్రేమిస్తాడు. రాముడూ సీతను ప్రేమిస్తాడు. సీత రాముడిని ప్రేమిస్తుంది. రావణ్‌ గొప్ప ప్రేమికుడు అవడం చేత సీతను లంకకు తెస్తాడు. రాముడి ప్రేమకన్నా రావణుడి ప్రేమ గొప్పది అని రాస్తాడు మన మొద్దు కిష్న. 
 ఈ కథను నా వ్యాసంలో ఉటంకించి మెచ్చుకున్నా. హిహ్హిహీ.

బాపు: రామ!రామ!

తాతాచారి: మన మహారచయిత హలాహలం కూడా రామాయణం మీద ఓ నాటకం రాసాడు. సీతను రాముడు ఓ వస్తువుగా చూసాడు. రావణుడు ఆమెను నిఝ్ఝంగా ప్రేమించాడు. రాముడు తనను వస్తువుగా చూస్తున్నాడని సీత అగ్గిలోకి దూకింది. ఇదీ హలాహలం రాసిన గొప్ప నాటకం. ఇదీ ఉటంకించా నా రాతల్లో.

బాపు: రామ!రామ!

తాతాచారి: రంధ్రాన్వేషణమ్మ రామాయణంలో ఎన్నో బొక్కలు కనిపెట్టిందని నా వ్యాసంలో మెచ్చుకున్నా. హీహీ.

బాపు: రామ!రామ!

ఇన్నిసార్లు రామ నామం వినిపిస్తే యత్రయత్ర రఘునాథ కీర్తనమ్‌, తత్ర తత్ర కృతమస్తకాంజలీమ్‌ గా అదృశ్యరూపంలో అక్కడ ఉండే హనుమంతుడు అక్కడ అప్పుడు ప్రత్యక్షమై తన గదాతాడనంతో తాతాచారిని లంకానగరపు సముద్రంలో పడేలా డిష్క్యాం అని తన్నడంతో, తాతాచారి ఢామ్మని పోయి లంఖిణి నోటిలో పడ్డాడు.

ఈ దృశ్యాన్ని బాపు గారు తన కుంచెతో కార్టూనుగా గీసి ఇంద్ర సభలో సభికులకు చూపించి వారిని అలరించడం కొసమెరుపు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన