హా హా హీహీ!

 


లబ్బర్‌ The cartoonist కార్టూన్లు వేస్తున్నాడు ఓ ప్రసిద్ధ పత్రిక కోసం.

లబ్బర్‌ భాయికి ఐడియాల మీద ఐడియాలు వచ్చేస్తున్నాయి.

ఒకటో cartoon: 

బార్గడ్డం ముని ఒకడు తపస్సు చేస్కుంటున్నాడు, బాన్పొట్టతో కామెడీగా. స్వర్గంలో కామెడీగా ఉన్న ఇంద్రుడి సీటు ఊగ్ఫోయింది.

 వెంఠనే భూలోకంలో ఎవడో కామెడీ గాడు తపస్సు చేస్తున్నాడని తెల్సుకుని మంచి సెక్సీగా ఉన్న రంభో ఊర్వశో మేనకో ఒక లేడీని పంప్‌తాడు. ఆ లేడీ ఆ బాన పొట్ట ముని ముందు భర్తనాట్యం చేస్తుంటే ఆ బాన పొ. బారు గె. కామెడీ మునిగాడు, ఆ భర్తనాట్యం చూసి చీకాకుగా, ఇదా నా తపస్సుకు profit? అని ఆ లేడీ మీదకు కమండలమ్‌ సే వాటర్‌ జల్లుతాడు హై. అప్డు ఆ లేడీ, కుర్చ బట్యల్లో మోడ్రన్‌‌గా మారిపోయి-

లంచ్‌కొస్తావా
మంచెకొస్తావా
కోడ్ని కోస్తావా
కన్నె డిన్నరిస్తావా!

అని పాడ్తూ ఆ మునిగాడి ముందు ఎగుర్తుంద్!

హా హా హీహీ! 

 హే!హే! సూపర్‌ కార్టూన్‌! 

రెండో కార్టూన్‌: 

రామ్డు బాణాల్‌ వేయడం practice చేస్తుంటాడ్‌. 
ఒక్టో బాణం గురి తప్తుంది! 
రెండో బాణం గురి తప్తుంది! 
మూడో బాణం గురి తప్తుంది!  
హహహ, రామ్డు కింద పడతాడ్‌.
 అది జోక్‌. 

హా హా హీహీ! 

 హే!హే! సూపర్‌ కార్టూన్‌! 

మూడో cartoon: ఒక బార్‌ గెడ్డం ముని గాడు పోతూ ఉంటే ఒక క్రికెట్‌ బాల్‌ వచ్చి తగిలి ఢామ్మని కింద పడ్‌తాడు. అప్డు కమండలం సే వాటర్‌ తీసి నీ బంతి పిల్లి అయిపోవాలి హై! అని షపిస్తాడ్‌! 

 
హా హా హీహీ! 

 హే!హే! సూపర్‌ కార్టూన్‌! 

ఈవిధంగా మన లబ్బరు బాబు చిత్ర విచిత్రమైన కార్టూన్లు గీస్తూ, తనలో తాను మాట్లాడుకుంటూ ఆనంద్‍ మిళింద్‍ గా ఉండగా, దూర్వాస మహర్షి ప్రత్యక్షమై- “ఓరీ! అధమాధమ చిత్రకారుడా! ఈ పుణ్యభూమిలో పుట్టి మహర్షులను,రాముడిని సైతం అపహాస్యం చేసేలా గేదె పేడ బొమ్మలు వేస్తావా?” అని కమండలం సే వాటర్‌ తీసి, “మ్లేచ్ఛ దేశపు ఎడారిలో తెలుగు మాట్లాడే ఒంటెగా పోయి పడు!” అని షపించి పారేశాడు. 

దాంతో మన కార్టూనిస్టు లబ్బరు బాబు అదేదో దేశంలో ఎడారిలో  ఒంటెగా పోయి పడ్డాడు. 

అక్కడ అరేబియా ఎడారి దొంగలు కనిపిస్తే సంతోషం పట్టలేక భయ్యా,భయ్యా! మాది తెనాలి హై! మీది తెనాలి హై! 
అని అరుస్తూ వాళ్ళ వైపుకి పోతే, వాళ్ళు చిత్ర విచిత్ర శబ్దాలు చేస్తున్న ఈ ఒంటెను చూసి ముందు ఆశ్చర్యపడి, తర్వాత మీద పడి, చంపేసి కూరొండుకుని కుమ్మి తినేశారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన