అడ్జస్టై పో తంబీ!
డబ్బింగ్ డాడీ:
చిన్ని చిన్ని ఆశ
చిన్నదని ఆశ
బ్రహ్మీ: చిన్న దాని ఆశా? ఆశ చిన్నదని ఆశా సార్?
డబ్బింగ్ డాడీ: డబ్బింగ్ పాటయ్యా. అడ్జస్టై పో.
కుళ్ళి పోయిన
మామిడిలో
జత పురుగులమౌదామా?
బ్రహ్మీ: ఏంటి సార్ డ్యూయెట్ అంత దరిద్రంగా ఉంది?
డబ్బింగ్ డాడీ: డబ్బింగ్ పాటయ్యా. అడ్జస్టై పో.
అక్కా! అక్కా!
మన ముంగిట్లో
కూసెను నేడొక
కాకీ!
బ్రహ్మీ: కాకులు కూయడం అంత బాలేదేమో సార్!
డబ్బింగ్ డాడీ: డబ్బింగ్ పాటయ్యా. అడ్జస్టై పో.
మెడ విరిగిన
బాటిల్లో
దీపములై
ఉందామా?
బ్రహ్మీ: అంటే ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు సార్?
డబ్బింగ్ డాడీ: డబ్బింగ్ పాటయ్యా. అడ్జస్టై పో.
బ్రహ్మీ: అలాగే అడ్జస్టవుతా సార్. చిన్న డౌట్ సార్. ఏ పిచ్చాస్పత్రి సార్ మనది?