ఒక కథ,అనేక దర్శకులు-part-2
Story Plot1:
రాజు, రాధ ప్రేమించుకున్నారు. కానీ విధివశాత్తూ రాధ పెళ్ళి సోముతో జరిగిపోయింది. ఆ తరువాత కొన్నేళ్ళకి కాకతాళీయంగా రాజు, రాధ ఇంటికి రావడం తటస్థించింది.
జంధ్యాల:
రాజు: హేయ్, రాధా! నువ్వేంటిక్కడా? మెళ్ళో రౌండ్ రౌండ్‌గా మెరుస్తోంది ఏమిటది?
ఆ! తాళి!
రాధా! రాధా! రాధా!
నీ మెళ్ళో తాళి కట్టిన ఆ పాఠోళీ గాడెవడు?
నాకు వెంఠనే తెలియాలి.
చెప్పు! చెప్పు!
రాధ: మా వారి పేరు సోము.
రాజు: ఆ! ఆ కోన్‌కిస్కా సోమూ గాడా?
రాధా, ముందు నువ్వా తాళి తీసి అవతల పారెయ్.
నేను నీకు అంతకన్నా పెద్దది, ఇంకా త్తళత్తళలాడే తాళి తెచ్చి కడతాను. ఓఖే?
అప్పుడు నువ్వూ నేనూ హాయిగా జాలీగా బెజవాడ, కాకినాడ, గుడివాడ,నందివాడ, మర్రివాడ, ముషిరివాడ ఇంచక్కా తిరగొచ్చు.
అంతే కాదు మై డియర్ రాధా! నువ్వు చూస్తానంటే అక్కయ్య పాలెం, వరదాయ పాలెం, ఎర్ర పాలెం, వేట పాలెం, భీముని పాలెం, రావుల పాలెం, పార్వతీ పాలెం, పాముల పాలెం, తేళ్ళ పాలెం, విస్సన్న పాలెం అన్నీ తిప్పి చూపిస్తా, తేగలు, బఠాణీలు కూడా ఇప్పిస్తా. నువ్వు వెంఠనే నీ ట్రంకు పెట్టె సద్దుకుని నాతో వచ్చేస్తున్నావంతే.
అవునూ, ఇందాకట్నించీ నా కాలు తొక్కుతున్నావేంటీ?
హహ, యూ నాటీ! సరసమా?
రాధ: సరసం కాదు, నీ బొందా కాదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు.
రాజు: ఆ! సోమూ, నువ్వా? ఎప్పుడొచ్చావ్?
హీహీ, నీకు పెళ్ళైందని విని మీ అవిడకి హలో చెప్పిపోదామని వచ్చా.
హీహీ, కాంగ్రాచ్యులేషన్స్! లక్కీ ఫెలో!
హీహీ, కొంచెం పనుంది, మళ్ళీ వస్తానే? హీహీ.
RGV:
ఢాం! ఢాం! ఢాం! కాల్పుల చప్పుళ్ళు.
రాజు: రాధా, నువ్వేంటిక్కడ? ఇది అండర్ వరల్డ్ లో మా శత్రువు సోమూ ఇల్లు. వాడిని, వాడి గాంగ్‌ని లేపేయడానికి వచ్చాం.
రాధ: రాజు, సోము నా హజ్బెండ్. అతన్ని వదిలెయ్ ప్లీజ్.
రాజు: ఈ చీకటి సామ్రాజ్యంలో ఎమోషన్స్ కి చోటు లేదు రాధా! Iam sorry!
సోము: మీ మాటలు విన్నాను. రాధా, నువ్వు కావాలంటే రాజు దగ్గరకు వెళ్ళిపోవచ్చు. But, నేను రాజును చంపడం decided.
రాజు: ఓ! విన్నావా? నన్ను చంపి రాధను తీస్కుని దుబాయ్ పారిపోవడాన్కి స్కెచ్ వేసావని మీ గాంగ్‌లో ఉన్న మా ఇన్ఫార్మర్స్ ఆల్రెడీ చెప్పారు.
సోము: ఈ దందాలో ఎవడి జాగ్రత్తలో వాడుండాలి. ఇక నించీ నా పార్ట్నర్ అవుతావా? మలేషియా మటన్ భాయితో చెప్పి నీకు బొంబాయి కామాటిపురా ఏరియా ఇప్పిస్తా. మాల్ సింగపూర్ నుంచి వస్తుంది. పోలిసుల్ని మనవాళ్ళు హాండిల్ చేస్తారు. డీల్ ఓకేనా?
రాధ: రాజు, ఓకే చెప్పు.
రాజు: ఓకే. నాకు డీల్ ఓకే.
ఇంతలో అక్కడికి వచ్చిన రాము గాంగ్ రాజుని, సోము ని ఢాం ఢామ్మని తుపాకీలతో ఏసేసింది.
తరువాత రాధ, రాముతో డీల్ కుదుర్చుకుని బొంబే అండర్ వరల్డ్ మాఫియా డాన్ అయింది.