పాయె!
గోంగూరకు క్రష్యా వాళ్ళు పేటెంట్ తీస్కున్నారంట!
గోంగూరకు పేటెంట్ ఏంటో వీళ్ళ తలకాయ్!
విస్తరాకులకు డుంబ్లిన్ దేశం వాళ్ళు పేటెంట్ తీస్కున్నారంట!
విస్తరాకుకి పేటెంట్ ఏంటో వీళ్ళ పిండాకూడు!
ఆకు దొన్నెలు మేమే కనిపెట్టామని బ్రీస్ దేశం వాళ్ళు పేటెంట్ తీస్కున్నారంట!
ఆకు దొన్నెలు వీళ్ళు కనిపెట్టడడమేమిటో వీళ్ళ శ్రార్ధం!
తరవాణిలో medical properties ఉన్నాయని బర్మనీ వాళ్ళు పేటెంట్ తీస్కున్నారంట!
మన తరవాణికి వీళ్ళ పేటెంట్ ఏంటో వీళ్ళ బొంద!
పళ్ళు తోముకోవడానికి బూడిద, బొగ్గు పొడి శ్రేష్టమని పేటెంట్…
ఇంక నాకు చెప్పకురా అబ్బాయ్! ఎక్కడో కాలుతోంది!