తెలుగు వంటకు సాటి లేదు సుమతీ!

 


ఆవ పెట్టిన అరటిపువ్వు కూర తిను. 
ఒంటికి మంచిది. 

ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట ఎవడు తింటాడు? 

పోనీ, చింత చిగురు పప్పు తిను. 
ఒంటికి మంచిది. 

ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట నేనస్సలు ముట్టుకోను.

సరేలే, అరటి దూట కూర తిను. 
ఒంటికి మంచిది. 

ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట ఎవడు తింటాడు? 

పోనీ, పనస పొట్టు కూర తిను. 
ఒంటికి మంచిది. 

ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట నేనస్సలు ముట్టుకోను.

సరేలే, గుమ్మడికాయ దప్పళం తిను.
ఒంటికి మంచిది.

ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట ఎవడు తింటాడు? 

పోనీ, రోటి పచ్చడి తిను. 
ఒంటికి మంచిది.

ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట నేనస్సలు ముట్టుకోను.

సరేలే, మజ్జిగ పులుసు తిను. 
ఒంటికి మంచిది. 

ఛీ!ఛీ! ఆ పాతకాలం వంట ఎవడు తింటాడు? 

సరే బాబు, అల్లం అంటే నాకు తెలీదా, 
బెల్లంలాగా పుల్లగా ఉంటుందన్నాడట వెనకటికెవడో. 

సరేకానీ, నీకు నచ్చినట్టు ఊరేగు.

కొన్నేళ్ళయ్యాక- 

ఏంటి బాబు, పచ్చికూరల జ్యూసులు, నానబెట్టిన పప్పులు అవీ తింటున్నావ్‌ సన్యాసిలాగా? 

ఏం చెప్పమంటారు? 
నాకు బీపీ సుగరు కొలెస్ట్రాలు అన్నీ ఎగ్స్ట్రాగా ఉండడం వల్ల గుండె, లివరు, కిడ్నీలు అన్నీ పాడయ్యాయట. 

అయ్యయ్యో, ఎంచేతో? 

రోజూ పిజ్జాలు,పాస్తాలు,బర్గర్లు, బిర్యానీలు తింటూ తింటూ ఉండడం వల్ల ఇలా అయ్యిందిట. 

అందుకని ఇప్పుడు బయట ఫుడ్డు తినట్లా.

అన్నీ మానేసి ఇంట్లోనే ఉప్పు లేని పప్పు, నూనె లేని వేపుడు,కారం లేని పచ్చడి, కాకరకాయ సలాడు, చప్పిడి కూర, గడ్డి జ్యూసు, గాదం లడ్డూ తింటున్నా. 

తవుడు తింటూ వయ్యారమా అన్నట్టు 
భలే స్టైల్‌ గా చెబుతున్నావురా. 

అరఘడియ భోగం, ఆర్నెల్లు రోగం అంటే ఇదే.
 
తిక్క కుదిరిందిలే, నీకిలా కావాల్సిందే. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5