చూపుడు గుర్రం-1

 

మనాడు ఆలిండియా అందగాడు.

మనాడు గుర్రం శ్వారీ బెమ్మాండంగా సేత్తాడు.
మనాడు ఫైటింగ్లయ్యి బెమ్మాండంగా సేత్తాడు.
మనాడు ఈత బెమ్మాండంగా కొడ్తాడు.

నటన ఆడి రత్తంలోనే ఉందెహే! 

ఆడి నాన్న హీరో, ఆడి తాత హీరో! 

ముత్తాత ఏం జేసేవాడు సార్‌?

నోర్మూస్కో. 
చనువిచ్చానని ఎక్కువ మాట్లాడమాక! 
ఏడుండాలో ఆడుండు. 
ఎగస్ట్రాలు చెయ్యమాక!

సరే సార్‌! ఆ తమిళ సినిమా అనుకున్నాం కదా సార్‌, 
 బాబుకి పదిసార్లు చూపించినా కళ్ళల్లో expressions లేవు సార్‌?

Expressions ఎవుడికి కావాలయ్యా?
Expressions కావాలంటే Long shots లో తియ్యండి. 
లేకపోతే ఎనకమాల్నుంచి తియ్యండి, సరి పోద్ది.

సార్‌, బాబు చేత  ఫైటింగ్స్ చేయిద్దామా సార్‌?

దానికి బాబెందుకయ్యా? డూపుని పెట్టు.

సార్‌, హీరోయిన్‌ తో డైలాగ్సు కాపీ సార్‌. 
బాబు రేపు షూటింగ్‌కి బాగా చదువుకుని వస్తే..

చూసానయ్యా, ఏందయ్యా హీరోయిన్ని మీరు మీరు అంటా ఈ డైలాగులు?

అంటే హీరో మర్యాదస్థుడు సార్‌, హీరోయిన్‌ పెద్ద ఆఫీసరు.

మర్యాదా లేదు, బొంగు లేదు. 
మీరు మీరు తీసేయించి 
అసేయ్‌,ఒసేయ్‌,ఏంటే‌ అని మార్చి రాయించు. 

సరే సార్‌! 

సినిమా పూర్తయింది. 

ఏందయ్యా ఇదా? 
తమిళ్‌లో సూపర్‌ హిట్‌! మనకాడేందయ్యా బాబుని పెట్టి తీస్తే పెద్ద హిట్టవుద్దనుంకుంటే, ఇట్టా చతిలబడ్డాదేందయ్యా! 

అంటే సార్‌, బాబు టాలెంట్‌ మనోళ్ళకి అర్థం కాలేదనుకుంటా సార్‌!

మళయాళంలో పెద్ద హిట్టుంది, సేమ్‌ స్టోరీ బాబును పెట్టి try చేద్దామా సార్‌? 

🎥 🎥 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన