నెల్లూరు పెద్దయ్య సన్నాయి నొక్కులు
లాయరు జీతం రోజుకి కోటిన్నర
రోజుకి కోటిన్నర జీతమంటమే!
నా జీవితంలో కళ్ళతో జూళ్ళా కోటి!
ఓర్ని అమ్మా బడవా!
ఏందిమే ఇది?
వారివారివారి!
ప్రత్యేక సదుపాయాలు,ఇంటర్‌నెట్, డాక్టర్లు,ఇంటి భోజనం..
ఏందిమే ఇదా? తల తిరుగుతాంది!
సరిపోదు, బంగళా ఇవ్వాలని కోటిన్నర లాయర్ల వాదన
ఓరినాయనో! ఓరి దేవుడో! బంగళా అంటమే!
ఎప్పుడన్నా బంగళాలో ఉన్నా?
తమ నాయకుడి అరెస్టు టీవీలో చూసి 96 మంది మృతి.
శేషయ్య(40), మృతుడికి భార్య, నలుగురు పిల్లలు, రామయ్య(50), మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు, జాలయ్య(46), మృతుడికి భార్య, ఆరుగురు పిల్లలు, అతనిపై ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రులు…
అరెస్టుకే సచ్చిపోయినారా ఈళ్ళంతా? ఎవుర్రా నాయినా మీరంతా?
ఆవుల కొట్లాటలో దూడల కాళ్ళు ఇరిగినాయంట!
ఈళ్ళు ప్రాణాలే తీస్కునిపోయినారా?
ఏందిమే, ఎటు పోతాంది లోకమా?
వారి వారి వారి!