నేనలాంటి వాడినే చిట్టీ!

 


అప్పుడు నన్ను బుజ్జీ అని,బంగారం అని ఎంతో ముద్దుగా పిల్చేవాడివి?
ఇప్పుడు మానేశావేం?

అప్పుడంటే నువ్వు జాజి తీగెలా ఉండేదానివి. 
నీకు ఓకే అయితే ఇప్పుడు బజ్జీ అని పిలుస్తా. ‌

అప్పుడు నాచుట్టూ తిరిగే వాడివి. 
ఇప్పుడు మొహం చూడ్డం మానేసావేం?

అప్పుడంటే అందంగా ఉన్నావని లైనేశా. 
ఇప్పుడంత అవసరం లేదని నువ్వు కనిపిస్తే U turn తీస్కుని
 పక్కన్నించి వెళ్పోతున్నా.

నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నావ్‌
 పెళ్ళి చేసుకున్నాక ఆ ప్రేమంతా ఎటు పోయిందో? 

అప్పుడేదో దూరంనుండి చూసి మోజు పడి చేసుకున్నా. 
 ఇప్పుడు చేసేది లేక, ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు 
అని రోజూ పాడుకుంటూ బతుకుతున్నా.

బండి మీద నేను వెనకాల కూచునుంటే రోడ్డు మీద పోయే అమ్మాయిని చూస్తావే? 

ఆ అమ్మాయికి లిఫ్ట్ కావాలేమో, నిన్ను దించేసి ఆ అమ్మాయిని ఎక్కించుకుందామని. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5