ఇగోమ్మా,నాంచారమ్మా!
నాంచారమ్మకి మొదట్నించీ విప్లవ ఎక్కిళ్ళు పాపం.
నాంచారమ్మకి,
ప్రేమ మీద నమ్మకం ఉందిగానీ
పెళ్ళి మీద నమ్మకం లేదు.
పెళ్ళి మీద నమ్మకం లేదుగానీ
సహజీవనం మీద నమ్మకం ఉంది.
నమ్మకం అంటే నమ్మకం లేదు గానీ
అపనమ్మకం మీద నమ్మకం ఉంది.
సంస్కృతం,సంస్కృతి మీద ఆసక్తి లేదు గానీ
అన్య భాషలు, వాటి సాహిత్యం మీద మక్కువ ఉంది.
చాఫ్కా, చింటో,మార్కీ, కార్గీ లాంటి అసాంఘిక రచనలను
చదివి చదివి బాగా వంటబట్టించుకోవడం వల్ల,
కొన్ని డిప్రెషన్ కతలు,
కొన్ని ఫస్ట్రేషన్ కతలు,
కొన్ని హాలోసినేషన్ కతలు,
కొన్ని ఫాంటసీ కతలు,
కొన్ని కాంప్లెక్స్ కతలు వ్రాసి
తన కతలు,పుష్కాల గురించి చెప్పెయ్యడానికి
ఫేక్‌బుక్‌ని ఆశ్రయించింది.
అందులో 4,996 మంది ఆల్రెడీ పండిన స్త్రీవాద ఇగోయిస్టులు, పురుషవాద ఇగోయిస్టులు, నానావాద ఇగోయిస్టులే కాక నలుగురు
ఇగో లేని ఇగోయిస్టులు ఆమె చుట్టూ చేరి వారికి అలవాటైన ఆహా ఓహోలు గుప్పించడం వల్ల అదంతా నిజమనుకున్న నాంచారమ్మ ఇగో అమాంతం రెండు తెలుగు రాష్ట్రాల సైజుకి పెరిగిపోయింది.
అందువల్ల ఓ రోజు తన ఫేక్‌బుక్ గోడ మీద ప్రభుత్వ ఉత్తర్వులాంటి పోస్టు ఒకటి వ్రాసి పడేసింది:
1. నా కతలు,పుస్తకాలు చదివి ఆహా ఓహో అనని వారు ఇగోయిస్టులు.
2. నా కతలు చదువు, కవితలు చదువు అని నన్ను అడిగే వారు ఇగోయిస్టులు.
3. నాతో friendship చెయ్యండి అని నన్ను అడిగేవారు ఇగోయిస్టులు.
4. నేను వాళ్ళ గోడ మీద పిడకలకి లైకులు అవీ కొడతానని ఆశించే వారు ఇగోయిస్టులు.
5. నాతో ఫేక్‌బుక్ స్నేహం కావాలంటే, మీ bio-data, complete work experience తో పాటు మీ పాస్‌పోర్ట్ front page,back page,ఆధార్ కార్డ్,పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ notarise చేయించి నాకు పంపితే నేను ఆ అప్లికేషన్లను పరిశీలించి నాకు నచ్చితేనే accept చేస్తాను.
ఈ post చదివిన ఆ నలుగురు ఇగో లేని ఇగోయిస్టులు ఆహో ఓహో అంటే నాంచారమ్మ ఇగో satisfy అయ్యి, ఆ నలుగురికీ లైకులు లవ్వులు కొడితే, ఆ ఇగో లేని ఇగోయిస్టుల ఇగో కూడా satisfy అయింది.
ఇంతలో ఈ post లోని ఇగో తమ ఇగోల కన్నా ఎక్కువగా ఉందని తమ తమ ఇగోలు కాపాడుకోవడానికి మిగిలిన 4,996 మంది ఇగోయిస్టులు నాంచారమ్మని unfriend, unfollow చేసి గోడ దూకి పారిపోయారు.
తెల్లారి లేచి తన ఫేక్‌బుక్ సామ్రాజ్యంలో నలుగురు ఇగో లేని ఇగోయిస్టులు తప్ప మిగిలిన వారంతా పారిపోయారని తెలుసుకున్న నాంచారమ్మ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల సైజులో ఉన్న ఇగో ఢామ్మని పేలిపోయింది.
ఇగో దెబ్బతిన్న నాంచారమ్మ, తాను మహా అభ్యుదయ రచయిత్రి నాంచారమ్మనని, తాను రాసిన డిప్రెషన్ కతలు, ఫస్ట్రేషన్ కతలు,
హాలోసినేషన్ కతలు, ఫాంటసీ కతలు, కాంప్లెక్స్ కతల లిస్టుతో పాటు తన bio-data, complete work experience, పాస్‌పోర్ట్ front page,back page,ఆధార్ కార్డ్,పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ notarise చేయించి ఆ వెళ్ళిపోయిన 4,996 నానావాద ఇగోయిస్టులకు friendship request లు పంపినా ఇంత వరకూ ఒక్కళ్ళూ నాంచారమ్మ application ని accept చేయకపోవడంతో నాంచారమ్మ ఆ ఫస్ట్రేషన్ లో ప్రస్తుతం కొన్ని హాలోసినేషన్ కతలు వ్రాస్తున్నట్టు వినికిడి.