రైటో అటో ఇటో లాగించుకో!

 


డైబీరియా కథాసప్తాహం ఏమిటో, భాగవత సప్తాహంలాగా? 

అదంతే, copy paste టైపు పేరు.

భాగవత సప్తాహం వింటే పుణ్యం పురుషార్ధం.
 మరి డైబీరియా సప్తాహం వింటే? 

ఆవేశం రావడం వల్ల బీపీ,గుండెపోటు ఇత్యాది వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 

ఇంతకీ ఈ డైబీరియా సప్తాహంలో ఏమి చెబుతారో?

ఫెవికాలిజమే నిజం, ఆకాశమంతా మనదే, మా దుస్తులు-మా ఇష్టం, సీత కన్నా శూర్పణఖ గొప్పది, రాముడి కన్నా రావణాసురుడు గొప్పవాడు, సనాతనాన్ని నిర్మూలిద్దాం రండి ఇలాంటి సెషన్సు చాలా ఉన్నాయి. 

మరి ఈ సప్తాహానికి వెళుతున్న పెడవాదులకు ఎంతోమంది శుభాకాంక్షలు చెప్పి ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళంతా ఈ భావాలతో ఏకీభవించే వాళ్ళేనంటావా? 

లేదురా, నాయనా. అదంతా దిఖావా. 
ఏదో అభ్యుదయవాదులమన్నట్టు, ఆధునికులమన్నట్టు సోషల్‌ మీడియాల్లో buildup ఇస్తూ ఉంటారు. 
 
ఇంట్లో  వారి ఆడవారు పద్ధతిగా చీరలు కట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు. పిల్లలు కూచిపూడి,భరత నాట్యాలు నేర్చుకుంటూ చక్కగా వినయవిధేయతలతో జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. 

ఓహో,అలాగా! 
అయితే పైకి left లాగా కనిపించినా లోపల రైటే రైటని వాళ్ళకీ తెలుసన్న మాట! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5