నడుస్తోంది నడుస్తోంది జీవితం



 


ఊళ్ళోకి కళాకారుడు దిగాడని వెళ్ళి చూడబోయాడు సుబ్బారావు.



Last week, Dallas లో నా ప్రోగ్రాం చాలా grand గా జరిగింది.
ఈ week మీ ఊళ్ళో. 

 ఇక్కడ్నించి నేరుగా రంపచోడవరంలో ప్రోగ్రాం,
తర్వాత అక్కడ్నించి రుమేనియాలో ప్రోగ్రాం. 

తర్వాత అక్కడ్నించి బందరులో ప్రోగ్రాం,
 అక్కడ్నించి బెల్జియంలో ప్రోగ్రాం. 

తర్వాత గన్నవరం ప్రోగ్రాం, 
 అక్కడ్నించి జోహాన్స్ బర్గ్ లో ప్రోగ్రాం.

అక్కడ్నించి అనకాపల్లి… 


తరువాత ఆ పక్కనే ఉన్న స్నేహితుడిని చూడబోయాడు. 
ఆ ఇల్లాలు ఉత్సాహంగా, 

ఈ summer హవాయి plan చేస్తున్నాం అన్నయ్య గారు, 
Last summer ఫ్లారిడా వెళ్ళాం.
ఆ last summer India వెళ్ళాం.
Before that యూరోప్‌ వెళ్ళాం.
Before యూరోప్‌, జపాన్‌ వెళ్ళాం.
Before జపాన్‌, సింగపూర్‌ వెళ్ళాం…


తరువాత ఆ పక్కనే ఉన్న మరో స్నేహితుడి తల్లిదండ్రులు వచ్చారని చూడ్డానికి వెళ్ళాడు. 


పుణ్యక్షేత్రాలన్నీ చూడ్డమేనయ్యా ఇప్పుడు మా పని. 

కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ వెళ్ళాం.
కాశీ, హరిద్వార్‌ వెళ్ళాం. 
తిరుపతి, next south India temples cover చేసాం.
తిరువనంతపురం, కన్యాకుమారీ చూసేసాం.
ద్వారక, అయోధ్య వెళ్ళాం.
కాశ్మీరు,కంచి చూసొచ్చాం…



కారులో ఇంటికి మళ్ళిన సుబ్బారావుకి జంధ్యాల గారి సిన్మాలో సీను గుర్తొచ్చింది. గుర్తుకు రాగానే నవ్వొచ్చింది. 
 తన కారు హారన్‌ కన్నా పెద్దగా నవ్వాడు. 

ఆ తర్వాత, మహానుభావా!జంధ్యాలా! ఏ స్వర్గంలో ఉన్నావయ్యా! 
అని మనసులో దణ్ణం పెట్టి ఇంటి వైపుకి సాగిపోయాడు.




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5