దీపావళి రోజు గాల్లోకి ఎగిరిన వామాసురుడు!

 


వామాసురుడు: దీపావళి రోజు టపాసుల వల్ల ఎంత కాలుష్యం! టపాసు రహిత పండుగ చేస్కోండి.

హిందూ బంధువు: మంచి మాట చెప్పారు. మరి, మనది కాని ఆంగ్ల సంవత్సరాది రోజు, ఎన్నికలప్పుడు సంబరాల్లోను,ఇంకా పెద్ద పెద్దల పెళ్ళిళ్ళలోను, సంబరాల్లోను టపాసులు విపరీతంగా మోగిస్తారుగా. వాటి గురించి మాట్లాడరేమి? 

వామాసురుడు: అదంతా అప్రస్తుతం. వేటి గురించి మాట్లాడమని మా సెంట్రల్‌ కమిటీ చెబుతుందో అవే మాట్లాడతాం. పండగ పేరుతో కాలుష్యం వ్యాప్తి చేస్తున్నందుకు సిగ్గు పడండయ్యా!

హిందూ బంధువు: మిగతా చాలా విషయాల్లోలాగే హిందువుల్లో అపరాధ భావం అదే guilt feeling తెప్పించడానికి ప్రచారం చేస్తున్నారన్న మాట. అయినా మాకున్న పండుగల్లో టపాసులు కాల్చుకునే ఏకైక పండుగ దీపావళి. సంవత్సరానికి ఒక్క రోజేగా.

వామాసురుడు: అసలు దీపావళి రోజు టపాసులు పేల్చే ఆచారం ముందునించీ లేదని తరువాత ప్రచారంలోకి వచ్చిందని మా వామపక్ష చరిత్రకారులతో చరిత్రను మరగేసి రాయిస్తున్నాం. దాంతో అందరూ గందరగోళంలో పడతారు. అదే మా పాత వ్యూహం. ఇక్కడ వాడుతున్నాం. హీహీ..

హిందూ బంధువు: ఓ! అసలెందుకు హిందూ పండుగల మీద మాత్రమే ఇలా దాడి చేస్తున్నారు? 

వామాసురుడు: హిందువులని అపరాధ భావానికి, ఆత్మన్యూనతకు గురి చెయ్యాలి. అదీ, ఏదో వారి బాగు కోరి చెబుతున్నట్టు చెప్పాలి. 

అప్పుడు దీపావళి అనుకో, మెల్లి మెల్లిగా వాళ్ళ చేత  టపాసులు కాల్చడం మానేయిస్తే వాళ్ళ పిల్లలకి ఆ పండుగ మీద ఆసక్తి పోతుంది. 

మా ప్రచారం వల్ల వారికి తమ సంస్కృతి అంటే తమకే చిరాకు పుడుతుంది. మెల్లిగా దూరం జరుగుతారు.

ఆ తరువాతీ తరం కేవలం ప్రమిదలు మాత్రమే పెడుతున్నారనుకో, వాళ్ళు లక్షల్లో ప్రమిదలు వెలిగించడం వల్ల గాల్లో మిథాలీ జమాక్సిన్‌ అనే రసాయనం కలుస్తోందని మావాళ్ళ చేత వ్యాసాలు రాయిస్తాం.

మా ప్రచారం వల్ల వారికి తమ సంస్కృతి అంటే తమకే చిరాకు పుడుతుంది. మెల్లిగా దూరం జరుగుతారు.

ఆ తరువాతీ తరం వాళ్ళకి అది ఏదో నామ్‌ కే వాస్తే పండుగలాగా అయిపోతుంది. 

హిందూ బంధువు: అదే, ఎందుకు ఇదంతా చెయ్యాలి అని?

వామాసురుడు: హిందువులు కలిసి ఒకచోటికి వచ్చే ప్రతి సందర్భాన్ని identify చేసి దాని మీద దాడి మొదలు పెడతాం.
 అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు విడిపోయి కొట్టుకు చచ్చి, తరువాత పూర్తిగా దూరం వెళ్ళిపోతారు. 
అలా తమ మూలాలని తామే అసహ్యించున్న మనుషులు deracinate అయ్యి మావైపుకి తిరుగుతారు. 

నాస్తికుడిని, తన సంస్కృతిని తానే అవహేళన చేసుకునే వాడిని మావైపుకి తిప్పుకోవడం తేలిక!

హిందూ బంధువు: ఇంత బహిరంగంగా ఈ విషయాలు నాకు చెబుతున్నావే? 

వామాసురుడు: హహ్హహ్హ! నీకు విషయం తెలిసినా నన్నేమీ చేయలేవు! మా లాబీయింగ్‌ అంత powerful! 

హిందూ బంధువు: ఇవాళ దీపావళి కదా, నీతో మాట్లాడుతూనే నీకింద నీకోసం లక్ష్మీ టపాసుల కట్ట వెలిగించా. Gift from your Hindu friend! 

హిందూ బంధువు అలా అంటున్నాడో లేదో, 
 వామాసురుడు ఢా…మ్మని వలయాకారంలో ఎగ్గిరి తాజ్‌మహల్‌ ముందున్న ఫౌంటెన్‌లో పడి కుయ్యో మొర్రో అన్నాడు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన