అహో!శ్రీ విష్ణు వేద రాయా!

 


కులం A : 


శ్రీ విష్ణు వేద రాయలి పిన్నమ్మది మా కులమే అని “మండపేట రహస్యం“ అన్న పుస్తకం మొదటి version‌ లో ఉండుద్ది. 
కానీ ఆ version పోగొట్టుకు పోయింది. 
ఇప్పుడు దొరికే version లో దొంగ నాయాళ్ళు కొంతమంది ఆళ్ళ కులమని మార్చి రాసుకున్నారు. ఆళ్ళ సంగతి తేలుత్తాం.

మండపేట రహస్యం మొదటి versionలో 
వేద రాయలి ఒంట్లో ఎర్ర రక్త కణాలు - లెఫ్‌,రై,లెఫ్‌,రై,ఎబౌట్‌ టా..ర్న్! 
తెల్ల రక్త కణాలు - రై,లెఫ్‌,రై,లెఫ్‌,ఎబౌట్‌ టా..ర్న్! 
అని మార్చింగ్‌ చేస్తయ్యని  తొంబైయ్యారో పేజీలో ఉండుద్దంట! 
మాకూ అంతే! సేమ్‌ టు సేమ్‌!
కనక శ్రీ విష్ణు వేద రాయలు మావోడే! మావోడే! మావోడే!

కులం B :

శ్రీ విష్ణు వేద రాయలి నాలుగో భార్య మా కులమేనని 
అనకాపల్లి ఎనకాల చెనిక్కాయల పల్లిలో శిలాశాసనం ఉండేదంట. 
అది రోడ్‌ వైడనింగ్‌లో పోయిపోచ్‌!
 దాని కోసరం ఎతకతాన్నాం.
 తవ్వతాన్నాం. 
అంచేత వేద రాయల్ది మా కులమే!

కులం C : 

శ్రీ విష్ణు వేద రాయలు మా ఖులం వాఢేనని ఛెప్ఫడానికి 
హెన్నో హెన్నెన్నో ఆధారాలుయ్యని ఛెప్ఫడానికి 
హెంథో సంతోషిస్తున్నాని,
 ఆనందిస్తున్నానని,
పులకరిస్తూ ఫలవరిస్తున్నాని 
ఢంఖా భజాయింఛి
థెలియజేసుకుంఠున్నాను!

అహో, వారి విద్యానగరంలో ఒఖ గోడలో వారు మా ఖులమే అని ధెలియజేసే రహస్య పత్రం ఒఖటి ఖనుగొన్నాం!

 హదే,హదే ఏఖైఖ అపురూప ఆత్మీయ ఆధారం!
 ఖాదని హెవరైనా అంఠే, ఖబడ్దార్‌! వారి థోలు థీస్తాం! 

Non-హిందూస్‌: 

శ్రీ విష్ణు వేద రాయల్కి “సురత్రాణ” అనే బిర్దు ఉంది. 
అంటే బరబ్బీలో సుల్తాన్‌ అని. 
అంద్కని అత్ను మావాడ్‌! 

కులం A,B,C: 

అట్టెట్టవుద్దయ్యా??
 ఎవడో బిరుదిస్తే మీవోడెట్టవౌతాడు??

Lefist red lady:

Yes,correct. నేను నాన్‌ హిండూస్‌ వైపే! 
వాళ్ళే రైటని మా సెంట్రల్‌ కమీటీ అంజనం వేసి నిర్థారించింది. 

కులం A,B,C: 

ఎవురమ్మా నువ్వు?
ఉగ్గు గిన్నెంత కుంకం బొట్టు పెట్టుకోని రెటమతం మాటలు మాట్లాడతాండావు?
 
Lefist red lady:

నేను అర్కిస్ట్ అలినిస్ట్ అమ్యూనిస్ట్ పెసిమిస్ట్ నాయకురాలిని!



ఆ వివాదం అలా సాగుతుండగానే 
ఒక్క పొద్దు పత్రిక ఊరికే ఉండలేక 
తెలుగుపల్లి‌ భాషేష్‌ చేత ఒక వ్యాసం రాయించింది. 

దాని సారాంశం ఇది: 

బరబ్బీ దేశంలో జుల్కా నగరంలో క్రీ.పూ. ఒకటో శతాబ్దిలో ఒక శాసనం దొరికింది. దాని మీద ష్‌ గ్‌ డ్‌ హ్‌ అన్న బరబ్బీ అక్షరాలున్నవి. 

ఆ అక్షరాలు సీమిత్‌ భాషలోకి వచ్చేటప్పటికి బ్‌ చ్‌ త్‌ వ్‌ అవుతాయి.
సీమిత్‌ నుండి హరామిక్‌లోకి వచ్చేటప్పటికి స్‌ ఖ్‌ ప్‌ య్‌ అవుతాయి. 
అవే హరామిక్‌ నుండి తెలుగులోకి వచ్చేటప్పటికి శ్ర్ వ్వ్ ద్‍ ర్‌ అవుతాయి!

ఫేకాగమ సూత్రం ప్రకారం-

శ్ర్ - శ్రీ అవుతుంది,
 వ్వ్ - విష్ణు అవుతుంది,
ద్‍ - వేద  అవుతుంది,
ర్‌ - రాయ అవుతుంది. 

మొత్తం కలిపితే “ శ్రీ విష్ణు వేద రాయ”! 

అంటే వేద రాయలు బరబ్బీ దేశం నుండి వచ్చాడనడానికి బలమైన ఆధారం కనిపిస్తోంది!

ఈ వ్యాసానికి ఎన్నెన్నో ఆహాహాలు ఓహోహోలు మారు పేర్లతో వచ్చిపడ్డాయి.

(అసలు క్రీ.పూ. ఒకటో శతాబ్ది నాటికి శ్రీ విష్ణు వేద రాయలు పుట్టనే లేదని, ఆ తరువాతెప్పుడో అయిదు వందలేళ్ళకి పుట్టాడని ఒక పాఠకుడు ఉత్తరం వ్రాస్తే technical difficulties వల్ల అది ప్రచురింపబడలేదు.)

ఇంతలో Lefists ప్రోద్బలంతో ఈ విషయం కోర్టుకు వెళ్ళిందని A,B,C కులాల నాయకులకి తెలిసి లబోదిబోమన్నారు. 

వెంటనే అంతా విభేదాలను పక్కన పెట్టి “జై విష్ణు వేదరాయ హిందూ సంఘం (JVVRHS)” ఒకటి పెట్టి కలిసి పోరాటం మొదలు పెట్టారు. 

కేసు నలభై ఏళ్ళు నడిచింది.

 పురావస్తు అధికారులు ఎన్నెన్నో తవ్వకాలు జరిపి, చరిత్ర పుటలు తిరగేసి,మరగేసి చివరికి వేద రాయలు హిందువే అని తేల్చారు!

కోర్టు తీర్పు JVVRHS కి అనుకూలంగా వచ్చింది.

అప్పటికి వయోవృద్ధులై చక్రాల కుర్చీల్లోను, చేతి కర్ర ఊతంతోను కోర్టుకు వచ్చిన A,B,C కుల నాయకులంతా కోర్టు తీర్పు విని ఒకరినొకరు అభినందించకుంటూ ఆనందభాష్పాలు రాల్చారు. 

కోర్టు తీర్పు విని ఒక్క పొద్దు పత్రిక ఒక సుదీర్ఘ సంపాదకీయం వ్రాసింది:

ఈరోజు ఒక నల్లని దినము. 
ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మతోన్మాద శక్తులు విజృంభించిన దుర్దినము.
అయినా సరే ఒక్క పొద్దు తన పోరాటం ఆపదు.
 అథో జగత్‌ సహోదరుల కోసం పిడికిలి బిగించి ఎర్ర సిరాతో సాహిత్యాన్ని సృజించడం మానదు.

మేం left అని right వాళ్ళు ఆరోపిస్తున్నారు.
 Right అని left వాళ్ళు అనుమాన పడుతున్నారు.
 
మేం లెఫ్టూ కాదు, రైటూ కాదు.
తంతే సెంటర్లో పడతామని మనవి చేసుకుంటున్నాం.

అందుకే, ఈ నెల మా ప్రత్యేక వ్యాసాలు-

శ్రీ విష్ణు వేద రాయలు హిందువెలా అవుతాడు? (తాతాచారి ప్రత్యేక వ్యాసం) , 
ఇది మత శక్తుల దొడ్డిదోవ విజయం (SRK వ్యాసం), 
వేదంలో శ్రీ విష్ణు వేద రాయలు లేడు! (వెవ్వెవ్వె వెంకోజీ ప్రత్యేక పరిశోధనాత్మక వ్యాసం)
 తో బాటు - శ్రీ విష్ణు వేద రాయలు స్వయంగా రచించిన “కృష్ణదాసు కథ” కూడా ప్రచురించి చేతులు దులుపుకుంటున్నాం.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన