The Alpha Animal!

 


నీకు “ఆల్ఫా మేల్‌” అంటే ఏంటో చెప్తా విను. 


పూర్వం ఆటవిక సమాజంలో గొప్ప బలవంతులు,ధైర్యశాలురు వేటకు వెళ్ళి జంతువుల్ని కొట్టుకొస్తే, 
మిగతా బలం లేని జనాలంతా గుహల్లో కూచుని వీళ్ళకేసం ఎదురు చూస్తూ ఉండేవారు. అలా వేటకు వెళ్ళే వీరులే “ఆల్ఫా మేల్స్“. 

నచ్చిన ఆడవారినందరినీ వీళ్ళే ఉంచేసుకునే వారు. 
ఆడవారు కూడా ఆల్ఫా లనే కావాలనుకునే వారు. 

కానీ మరి మిగతా బీటా,గామా,కప్పా గాళ్ళకి కూడా పెళ్ళాలు కావాలి కనుక తరువాత రోజుల్లో పెళ్ళి concept,ఒక భార్య,ఒక భర్త concepts వచ్చాయి. అర్థమైందా? 

Interesting!

ఇంకా చెప్తా విను. ఆల్ఫా మేల్‌ తనకు నచ్చిన ఫిమేల్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు.
 అడ్డొచ్చిన వాళ్ళ వాళ్ళందర్నీ ఏసేసైనా తనకు నచ్చిన పిల్లను ఎత్తుకు పోతాడు. 

అదేంటి? ముందు ప్రేమ,స్నేహంలాంటివి ఏమీ ఉండవా?

అదంతా హంబక్‌! 
అవన్నీ చేతగాని బీటా,గామా,కప్పా గాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు.
 ఆల్ఫా మేల్‌ direct action లోకి దిగుతాడు!

మరి సంప్రదాయం,కులం,ఆచారం?

అదంతా ట్రాష్‌!
సొసైటీ నడవడం కోసం పెట్టుకున్నారు.
 అసలు ఆల్ఫా మేల్‌ ని చూడగానే అమ్మాయిలు అవన్నీ వదిలేసి వచ్చేస్తారు.  

ఓ! అవునా? అది సరే, ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావ్‌? 

నేను ద గ్రేట్‌ ఆల్ఫా మేల్‌ని!  నువ్వు నాకు నచ్చావ్‌. వచ్చి బండెక్కు. 

నేనూ ఆల్ఫా ఫీమేల్‌నే!

హిహి,నిన్ను చూడగానే గుర్తు పట్టా!
Don’t waste time.పద,బండెక్కు.

మా నాన్న కూడా ఆల్ఫానే.
నేను మా నాన్న తెచ్చిన వాడినే పెళ్ళి చేసుకుంటా!

ఈ గ్రేట్‌ ఆల్ఫాని కాదని,
ఇంకెవడో ఊల్ఫా గాడిని చేసుకుంటానంటావా? 

పోరారేయ్‌! 

ఈ ఆల్ఫా మేల్‌ని కాదనడమే కాకుండా పోరా! అంటావా? 
ఎంత ధైర్యం! 
నా చేతిలో ఇది చూసావా?
 నోర్మూస్కుని బండెక్కు!

అది నా దగ్గిరా ఉంది బే !

డిష్క్యాం! డిష్క్యాం! 

డిష్క్యాం! డిష్క్యాం! 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన