The over action guy
బ్రహ్మీ: రామాయణాన్ని నీ ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నావ్?
గజిబిజి బాబు: రామాయణం ప్రాచీన సాహిత్యంలో భాగం.
ఎవరైనా విమర్శించవచ్చు.
బ్రహ్మీ: అలాగా.
ప్రాచీన సాహిత్యం అంటున్నావుగా.
అయితే రామాయణాన్ని పాఠ్యాంశంగా చేరిస్తే సరి.
గజిబిజి బాబు: పాఠ్యాంశంగా ఎలా చేరుస్తారు?
అది మతపరమైన పుస్తకం.
బ్రహ్మీ: ఓ! మరి ఇప్పుడే ప్రాచీన సాహిత్యమన్నావ్?
గజిబిజి బాబు: 😁😁
బ్రహ్మీ: సరే, మరి ఒక మతానికి చెందిన
ధార్మిక గ్రంథాన్ని ఎలా విమర్శిస్తున్నావ్?
గజిబిజి బాబు: నేనూ హిందువునే.
నాకు తెలిసిందే నేను విమర్శిస్తా.
మిగిలినవి నాకు అనవసరం.
బ్రహ్మీ: ఓహో! హిందూ ధార్మిక గ్రంథాలు తప్ప
ఇంకోటి ముట్టవన్న మాట.
గజిబిజి బాబు: 😁😁
బ్రహ్మీ: అయితే హిందువుగా వాల్మీకి రామాయణాన్ని
ఆమూలాగ్రం అధ్యయనం చేసావా?
గజిబిజి బాబు: అందులో అధ్యయనం చేయడానికేముందీ?
ఎన్ని సినిమాలు, సీరియళ్ళు రాలేదూ?
అయినా ఓసారి తిరగేసా.
నేను ఎక్కడెక్కడ నా పులుముడు వాదాలన్నీ
లాగొచ్చో పాయింట్లు రాసుకున్నా.
బ్రహ్మీ: రోజూ రామాయణాన్ని పారాయణ చేసేవారున్నారు.
రామకోటి వ్రాసేవారు కోట్లల్లో ఉన్నారు.
వారి మనోభావాల గురించి ఆలోచించావా?
గజిబిజి బాబు: వాళ్ళదంతా మూఢ భక్తి.
నాకు దేవుడి మీద నమ్మకం లేదు.
అసలు ఈ దేశంలో మతం అన్నది
లేకుండా చెయ్యాలనేదే నా సంకల్పం.
బ్రహ్మీ: హిందూ మతం ఒకటేనా?
లేక మొత్తం అన్ని మతాలు లేకుండా చెయ్యాలనా?
గజిబిజి బాబు: మిగతావాటి సంగతి నాకెందుకు?
హిందువుగా నేను చెప్పేది
హిందూ మతాన్ని గురించే.
హిహ్హిహ్హీ! 😁
బ్రహ్మీ: హిందువునంటావు, దేవుడి మీద నమ్మకం లేదంటావు.
పనిగట్టుకుని జాతికి ఆదర్శమైన రామాయణాన్ని తిడుతున్నావ్.
గజిబిజి బాబు: హిహ్హిహ్హీ, అది నా వాక్ స్వాతంత్ర్యం. నా హక్కు. 😁
గజిబిజి బాబు నీచ్ కమీనే సమాధానాలకి,over action కి
మన బ్రహ్మీకి తిక్క రేగి ఎలా react అయ్యాడో చూడండి: