భూత పిశాచ నికట నహీ ఆవై!
ప్రజలు: 500 వందల యేళ్ళ నాటి కల.
మా విరాళాలతో కట్టుకుంటున్నాం.
దేశంలోని గ్రామ గ్రామమూ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నాం.
ప్రత్యేక కానుకలు చేయించి ఇస్తున్నాం.
విదేశీ ప్రజలు: మా దేశాలనుండి పవిత్ర జలాలు,
కానుకలు పంపుతున్నాం.
అవి తీసుకుని మేమూ వస్తున్నాం.
ఖాన్ గ్రాస్ పార్టీ: ఇది ఓట్ల కోసం కుట్ర.
వేరే వాళ్ళవైతే ఎగురుకుంటూ వెళ్ళే వాళ్ళం.
గుడి కదా మేం రాం.
పాతారాం పాచూరి: మతాన్ని మేం రాజకీయాలతో
కలపవచ్చు గానీ మీరు కలపకూడదు.
మేం రాం.
మీ గుడికీ మాకు రాం రాం.
సామాన్యుడు: వీళ్ళను పిలవకపోతే పిలవలేదని
ఇంకో రకం గొడవ చేసేవాళ్ళు.
గ్రామస్తుడు: ఈ నీచ్ కమీనే డిమిత్రీగాళ్ళొత్తే
గుడిని మళ్ళోమాటు సంప్రోక్షణ చేసే పని.
సాధువు: భూత పిశాచ నికట నహీ ఆవై
మహావీర జబ నామ సునావై!