అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః

 



ఏంటి బాబూ, మావాడ్ని పప్పు గాడని ఎగతాళి చేస్తున్నావట?
నువ్వు తినవా పప్పు?

🤐🤐

నువ్వేమన్నా పులుల్ని, సింహాల్ని వేటాడుతున్నావా? 
ఇంటెనకాల తిరిగే కోడిని, అది పెట్టే గుడ్డునేగా నువ్వు తినేది? 

🤐🤐

పోనీ అడవికెళ్ళి జింకల్ని కొట్టుకొస్తున్నావా?
షాపులో పాక్‌ చేసి పెట్టిన మటనేగా నువ్వు తెచ్చుకునేది?

🤐🤐

తినేవాడు గొప్పా? అవకాశమున్నా తినని వాడు గొప్పా? 

🤐🤐

అహింస అనేది వ్రతంగా పెట్టుకున్న వాడినెవడినైనా సరే, 
వాడి ఆహార నియమాన్ని గౌరవించు. 

ఎందుకంటే వాడు ప్రకృతికి, ఏ ప్రాణికి ఏరకమైన హాని చెయ్యకుండా బతకాలని ప్రయత్నిస్తున్నాడు. వాడి ప్రయత్నాన్ని అభినందించు.

🤐🤐

మేమంతా హనుమాన్‌ వ్యాయామశాల వస్తాదులం. 
అందరం శాకాహారులమే! 

😲😲

శాకాహారాన్ని తక్కువ చెయ్యకు, 
మాంసాహారాన్ని గొప్ప అనుకోకు. 
సరేనా? 

🫣🫡

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన