అయ్యో!అయ్యో!రామా!కృష్ణా!
అయ్యో! ఇది విన్నారా?
మన పవిత్ర గాయత్రీ మంత్రాన్ని కాపీ కొట్టి వాళ్ళ మత ప్రచారానికి వాడుకుంటున్నారండీ!
అయ్యో!అయ్యో!
నిజమేనండీ!
నావి కూడా రెండు అయ్యోలు వేసుకోండి!
అయ్యో!అయ్యో!
అయ్యో! అయ్యో! మన మాలధారణ కాపీ కొట్టి వాళ్ళూ మాలలు వేసుకుంటున్నారండీ!
నిజమేనండీ!
నావి కూడా రెండు అయ్యోలు కలుపుకోండి!
అయ్యో!అయ్యో!
అయ్యో!అయ్యో! మనలాగే ధ్వజస్థంభాలు అవీ..
నిజమేనండీ!
నావి కూడా రెండు అయ్యోలు హెచ్చించుకోండి!
అయ్యో!అయ్యో!
ఇందాకట్నించీ నాతోబాటే అయ్యో అయ్యో అని మీరూ బాధపడుతున్నారు చూడండీ, మన ధర్మాన్ని గురించి మీకున్న ఆర్తి నాకెంతో నచ్చింది సుమండీ!
అయ్యో, మీకోసం ఎన్ని అయ్యోలైనా శృతి కలుపుతానండీ!
ఇంతకీ ఈ విషయం మీద అయ్యోలు కాకుండా ఇంకేమీ చెయ్యలేమంటారా?
మనమేం చెయ్యగలమండీ,
ఆ కృష్ణ పరమాత్మే కాపాడాలి !
అది కాదండీ, మా గాయత్రి కొన్ని వేల యేళ్ళకన్నా పాతది. అది మా ధర్మంలో ఎంతో పవిత్రమైనది, దాన్ని అనుకరించినా, మార్చినా,అపహసించినా నేరం అని చట్టం తేవాలని డిమాండ్ చెయ్యొచ్చు కదండీ.
అబ్బే, ఆ గొడవలన్నీ మనకెందుకండీ?
మనమేం చెయ్యగలం?
ఆ శ్రీరామచంద్రమూర్తే కాపాడాలి!
రాముడు వానర సైన్యంతో మహా మహా రాక్షసులుండే స్వర్ణలంకకు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేస్తే, రాముడి సైన్యంలో ఒక్కడూ చావలేదు, రావణాసురుడి సైన్యంలో ఒక్కడూ మిగల్లేదు, తెలుసుగదండీ?
తెలుసండీ? అయితే ఏమంటారు?
కృష్ణుడు ఒంటి చేత్తో ఎంతోమంది రాక్షసులను చంపాడు, ఎంతోమంది రాజులను ఓడించాడు, కురుక్షేత్ర సంగ్రామాన్ని దగ్గరుండి నడిపించాడు.
తెలుసుగదండీ?
తెలుసండీ? అయితే ఏమంటారు?
రాముడు, కృష్ణుడు ధర్మం కోసం యుద్ధాలు చేసారండీ!
అయ్యో!అయ్యో! అంటూ కూచోలేదు!
అయితే ఇప్పుడు యుద్ధం చెయ్యాలంటారా?
అమ్మయ్యోయ్!
రామా! రామా!
కృష్ణా!కృష్ణా!
శరణు!శరణు!