భరతమాతకు శిరోభారాలు! - 1

 



జంబూ ద్వీపం నుండి  కవి గార్లు, కవయిత్రి గార్లు కొందరు క్రౌంచ ద్వీపంలో జరుగుతున్న సాహితీ సభకు నిర్వాహకుల ఆహ్వానం మీద వచ్చారు. వారంతా వేదికను అలంకరించారు. 

వారిలో ఓ కవి లేచి,

 భరత మాతకు పురిటి నెప్పులా? 
అయితే భర్త మాతకు భర్త ఎవరు? 

అని నా కవితతో ప్రశ్నించా. 
అంతే, ఈ మతోన్మాదులు నన్ను అన్యాయంగా trolling చేసారు. 

అయ్యో!అయ్యో! భరత మాతను ఇలా అవమానిస్తున్నారేమిటండీ? 
అన్నాడు ప్రేక్షకుల్లో కూర్చున్న ఓ  తెలుగు వాడు పక్కనున్న గడుసు వాడితో. 

చిన్నగా మాట్లాడండి, ఇతను బీభత్స అకాడెమీ యువ పురస్కార గ్రహీత  అన్నాడా గడుసు వాడు. 

ఇంకో కవి లేచి, 

భారత దేశాన్ని మాత అనాల్సిందే
అన్నాడో బత్తాయి!
భరత మాతకు భర్తలెందరని 
నేనడిగితే బుస్సుమన్నాడు!

అని నా కవితతో ప్రశ్నిస్తే మతోన్మాదులు నన్ను trolling చేసారు అని “వా”పోయాడు. 

అయ్యో! అయ్యో! ఏమిటంటీ భరత మాతను ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? బత్తాయిలేమిటండీ? 

ఇతను బీభత్స అకాడెమీ అవార్డు గ్రహీత అండీ! 
బత్తాయిలంటే దేశ భక్తులని పిండితార్ధం!
అన్నాడు గడుసు వాడు. 

ఇంకో కవయిత్రి లేచి, 

భారత్‌ మాతకీ జై!
అనమన్నాడో బత్తాయి!
అననంటే దేశద్రోహినంటున్నాడు!
ఇదెక్కడి అన్యాయం?
ఇదెక్కడి ఘోరం?

అన్న నా కవిత కూడా మతోన్మాదుల చేత troll చేయబడింది. దేశం ఇంత ఘోరంగా తయారైంది..


భారత మాత అని, భారత మాతకి జై! అనడంలో గర్వపడాల్సిందేగానీ సిగ్గు పడాల్సింది ఏముందండీ? అన్నాడా తెలుగు వాడు అయోమయంగా.

భరత మాతకు ముద్దు బిడ్డలైతే ఆ మాతకు జయం కలగాని జయ జయధ్వానాలు చేస్తారు. 
వీళ్ళు భరత మాతకు మొద్దు బిడ్డలు! ఆ తల్లికి శిరోభారాలు! 
అన్నాడు గడుసు వాడు. 

భారత మాత అనకపోతే మానె, ఇంత అసహ్యంగా కవిత్వాలు రాయాల్సిన అవసరం ఏముందండీ?  

ప్రజలు పవిత్రంగా భావించే ప్రతి విషయం మీదా దాడి చెయ్యడమే ఎడమ వాదుల పని. 
ఇదంతా ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా జరుగుతుంది. 
వీళ్ళకు మద్దతుగా వీళ్ళ మాటలకు academic weightage ఇచ్చేందుకు తాతాచార్లను, జెప్ఫా భాయిలను యూనివర్శిటీల్లో కూచోబెడతారు! 


దీని వెనకాల ఇంత మతలబు ఉందా? ఛీ!ఛీ!  వీళ్ళను ఏమన్నా పాపం లేదు అన్నాడు తెలుగు వాడు ఆవేశంగా. 

పోనీ వేదిక మీదకి వెళ్ళి, భరత మాతను అవమానిస్తే ఖబడ్దార్‌ అని గట్టిగా చెప్పండి, అన్నాడు గడుసు వాడు. 

అబ్బే, ఇలాంటి వాళ్ళతో మనకెందుకండీ? 
ఆ భగవంతుడే వీళ్ళకి బుద్ధి చెబుతాడు 
అన్నాడు తెలుగు వాడు వెనక్కి తగ్గుతూ. 

అంటే, భరత మాతే దిగి వచ్చి వీళ్ళను నడ్డి మీద త్రిశూలంతో పొడవాలంటారు? అన్నాడు గడుసు వాడు నవ్వుతూ. 

అయితే మరి మీరేం చేస్తున్నారు? అన్నాడు తెలుగు వాడు అసహనంగా. 

వీళ్ళందరినీ troll చేసే ఆ బత్తాయిని నేనే అన్నాడు గడుసు వాడు. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన