సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 2

 



మొద్దు కిష్నా, మొద్దు కిష్నా, కర్ణాటక సంగీతమంటే ఏమిటి? 

రాగాలు, ఆలాపనలు,technicalities,talent అంతే!

మరి భావం, భక్తి,సాహిత్యం?

భక్తి గిక్తీ ఏమీ లేదు!

మరి త్యాగరాజు,పురంధర దాసు వీళ్ళంతా? 

అంతా ట్రాష్‌!
అసలు కర్ణాటక సంగీతానికి మతానికీ సంబంధం లేదు!

సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గము గలదే  అన్నాడే త్యాగయ్య?
నువ్వు భక్తిని పక్కన పెట్టి కేవలం technicalities, చమక్కులు ప్రదర్శిస్తే ఆ కీర్తనల పవిత్రత పోదూ? 

పవిత్రత గాడిద గుడ్డు ఏమీ లేదు!

కర్ణాటక సంగీతం, సాహిత్యం సనాతన సంస్కృతికి చెందినవి. నాదోపాసనతో భగవంతుని చేరుకోవచ్చుననే విశ్వాసంతో భక్తితో నేర్చుకుని ఆలపించేవి, అన్నీ హిందూ దేవీ దేవతల మీద వ్రాసిన కీర్తనలే కదయ్యా, మొద్దు కిష్నా?

మతానికి కర్ణాటక సంగీతానికి సంబంధం లేదు. 
నేనింకనించీ రోజుకి రెండు కీర్తనలు వేరే మతాల దేవుళ్ళ మీద రాసి త్యాగరాయ కృతుల బాణీలో పాడతా!
ఇదే నా ఛాలెంజ్‌! 
బస్తీ మే సవాల్‌! 

 బాగుందయ్యా,మొద్దు కిష్నా! 
ఓ పని చెయ్యి, వేరే మతంలోకి మారి అప్పుడు రాముడి మీద, కృష్ణుడి మీద,శివుడి మీద కృతులు రాసి పాడి చూడు. సరేనా? 

నేను ఏ మతాన్ని ఫాలో అవను కానీ హిందూ మతాన్ని వ్యతిరేకిస్తా!
నాదంతా కురిడియార్‌ మార్గం.
 ఆయనే నా గురువు!

ఓ!అలా చెప్పు! 
ఇంతకీ సూటు బూటు వేసుకుని ఎక్కడికి బయల్దేరావ్‌? 

కచేరీకి! 
“రామ” అని వచ్చే చోటల్లా వేరే మతం దేవుడి పేరు పెట్టి త్యాగరాయ కీర్తన మార్చి పాడబోతున్నా!

రామ!రామ! 
త్యాగ రాజ స్వామి సమాధి నుండి లేచి వచ్చి నీ బుర్ర రామకీర్తన పాడిస్తాడేమోనయ్యా, జాగ్రత్త! 




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన