మహా నాయకుడి బిడ్డలు

 



ఏంటండీ, ఆ మహా నాయకుడికి శిలావిగ్రహం పెడదామని చందా అడిగితే ఆయన కొడుకులు, కూతుళ్ళు మేం ఇవ్వం అన్నారట?

అంత గొప్ప ప్రజా సేవకుడి కడుపున చెడబుట్టారు!

అయ్యో, మీకు తెలియదండీ,
ఆయన ఇల్లు, పిల్లలు పట్టించుకోకుండా 
ప్రజా సేవ అంటూ తిరిగేవాడండీ!

అలాగా! సమాజం కోసం కుటుంబాన్ని 
పక్కన పెట్టిన మహానుభావుడు!

ఆయన పిల్లల ఫీజులు కట్టకుండా,
 వాళ్ళ చదువులు పట్టకుండా 
 ప్రజా సేవ అంటూ ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడండీ!

అలాగా! సమాజం కోసం తన వాళ్ళనే పక్కన పెట్టిన ధన్యజీవి!

ఆయన ఉన్న ఆస్తులు పాస్తులు కూడా 
పిల్లలకి దక్కకుండా సమాజానికి రాసిచ్చేసాడండీ!

అలాగా! సమాజం కోసం తన ఆస్తినే త్యాగం చేసిన గొప్ప మనిషి!

ఆయన సమాజం కోసం చివరికి తన ఇల్లు కూడా గ్రంథాలయానికి రాసిచ్చేసాడని, ఇప్పుడాయన భార్యకు ఉండడానికి ఇల్లు లేదని తెలిసిందండీ!

ఆహాహా! ఇంత గొప్ప ప్రజా నాయకుడు నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు!  
ఇంతకీ ఆ పిల్లలు మాత్రం తండ్రి గొప్పతనాన్ని గుర్తించలేని పచ్చి స్వార్ధపరులు! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన