రచయిత-మనిషి

 


న్యాయం, ధర్మం అని కతలు రాసే నేటి ఆధునిక రచయితలంతా 

నిజ జీవితంలోను న్యాయంగా, ధర్మంగా జీవిస్తారంటారా?

😁😁

ఆడ వారి కష్టాల మీద కన్నీటి కతలు రాసే రచైతలు వాళ్ళ ఇళ్ళళ్ళో ఆడవాళ్ళని బాగా చూసుకుంటారంటారా? 

😁😁

తెలియక పోతే తెలీదని చెప్పండి. నవ్వుతారే?

రచయిత రచనలను మాత్రమే చూడాలి, రచయితను కాదు అన్న ఆధునిక సిద్ధాంతం మీకు తెలియనట్టుంది! 😁

ఓహో, అలాగా. అయితే రచయితను పట్టించుకోవక్కర లేదన్న మాట. 
రచనలను చదివి ఊరుకుంటే సరిపోతుంది. అంతేగా? 

అంతే గానీ, మరి చదివే సాహితీ అభిమానులంతా 
నిజ జీవితంలో గొప్ప ప్రవర్తన కలిగిన వారా? 😁

నిజమేలెండి. అయితే ఏమంటారు? 
రచయిత కనిపిస్తే నమస్కారం పెట్టాలా వద్దా? 

అయ్యా, మీరు నిజ జీవితంలో అచ్ఛానో, లుచ్ఛానో నాకు తెలియదుగానీ,  
 మీలోని రచయితకు మాత్రం నమస్కారం చేస్తున్నాను అని చెప్పండి, సరి పోతుంది! 😁😁

అమ్మయ్యోయ్‌, అప్పుడుగానీ ఆ రచయితలోంచి అసలు మనిషి బయటికి రాడు! 😇


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన