అందానికి నేనే అప్ప !

 


మా అక్క శ్రీదేవీలాగుండుద్ది.
 నేను మా అక్కలాగుంటా!

అట్నా! 

మా అక్క జడ నాగుపాంలాగుండుద్ది. 
నాదీ అంతే. ఒత్తూ బారూ!

అట్నా!

మా అక్క కాలి పొడుగు మనిషి.
నేనూ అంతే, సన్నం,నిటారు!

అట్నా!

మా అక్కది గుండ్రం మొకం
నాది కోల మొకం!

అట్నా?
సరేగానీ, ఎట్టొచ్చిందో అంతందం?

నా అక్క పసుపు, చెనిగి పిండి, పెరుగు పెట్టుద్ది మొహానికి.
నేను కలబంద, ముల్తానీ మట్టి పెడతా!

మాయక్క తలకి అవదం పెట్టుద్ది.
నేనైతే కొబ్బిరి నూనె మంచిగా పెడతా.

రాత్రికి మాయక్క ఫెయిర్‌ అండ్‌ లౌలీ రాసిద్ది.
నేను పాల మీగడ రాత్తా.

అయితే నీకన్నా మీ అక్కే అందంగా ఉండుద్దా?

చీ! నేనే అందంగుంటా!

అట్నా, మరి శ్రీదేవి?

శ్రీదేవి కన్నా మా అక్కే బాగుండుద్ది!

మరి నువ్వు?

అళ్ళిద్దరికన్నా నేనే బాగుంటా!

అట్నా! 😁


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5