పోస్ట్‌లు

ఆగస్టు, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆ “పాత”మధురాలు!

  ఆ రోజుల్లో పది పైసలకి పిప్పర్‌మెంటు తెల్లదారంతో కట్టి తిప్పుకుని ఆడుకోడానికి,అదొచ్చేది, గుర్తుందా?  ఆడుకున్నాక పిప్పర్మెంటు తినేసి ఆ తాడుకి గొల్డ్ స్పాటు మూతలుంటయ్యే, అవి తగిలించి ఆడుకునే వాళ్ళం! అవును, ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭 అప్పట్లో నారింజ తొనలని అమ్మే వాళ్ళు. చప్పరించుకుంటూ సైకిల్‌ తొక్కుకుంటూ ఊరంతా తిరిగే వాళ్ళం. ఎంత బాగుండేదో!  అవును,ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭 ఆ రోజుల్లో హనీ చాక్లెట్లని అమ్మేవాళ్ళు. పావలాకి ఒకటి. ఎంత బాగుండేవో అచ్చం తేనెలాగే. ఇప్పుడెక్కడా రావట్లా.  అవును, ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭 ఆ రోజుల్లో బాల్‌ పాయింటు పెన్ను రీఫిల్‌ ముక్కు తీసి అందులో ఇంకు పోసి రాసేవాళ్ళం కదూ? ఏంటో ఆ రోజులు మళ్ళీ వస్తయ్యా?  అవును, ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭 ఆ రోజుల్లో మినీ ఇంకు పెన్నులు బుడ్డి బుడ్డివి దొరికేవి.  నా దగ్గరా ఒకటి ఉండేది.  బాల్‌‌ పాయింటు పెన్నుల్లో హీరో పెన్నులే వాడేవాడ్ని. ఆ పెన్నులు నా దగ్గర ఇంకా భద్రంగా ఉన్నాయ్‌! అవును, ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭  ఎవరండీ వీళ్ళంతా?  పాత సంగతులు మాట్లాడుకుంటూ ఏడుస్తున్నారు?  ...

ఇరుగు - పొరుగు

  మూర్తి కొత్త దేశానికి కొత్తగా వచ్చాడు.  ఇరుగు-పొరుగు అన్న యాప్‌లో చేరండి, మీ ఇరుగు పొరుగు వారు పరిచయమౌతారు, చుట్టు పక్కల ఏం జరుగుతుందో తెలుస్తుందని తెలిసిన వారు సలహా ఇస్తే ఉత్సాహంగా అందులో చేరాడు.  ఆ సదరు యాప్‌లో ఇరుగుల ఇడుములు,ఇష్టాలు,పొరుగుల పాట్లు, పండగలు ఏమిటో చూద్దామని అక్కడ పేస్టు చేయబడ్డ పోస్టులు చూడబోయాడు - 1. మీలో ఎవరిదో డాగు మా లానులో పూపింది.  అది మాకు మిక్కిలి క్లేశము కలిగించినది. ఆ సదరు అనుచిత కార్యమును మా యొక్క కెమెరా క్లిక్కింది. చూడుడి. 2. మీ డాగు మా డాగుని చూచి బార్కుట చేత మా డాగుకు జ్వరము వచ్చినది. అది డిప్రెషనుకు లోనై ప్రస్తుతము మానసిక వైద్యునిచే చికిత్స తీసుకొనుచున్నది. అందుచే మా కుటుంబము మొత్తము కుంగిపోతిమి. మా గరాజు బయలున మేము ఏర్పాటు చేసిన కెమెరా ఆ భయభ్రాంత బార్కును మొత్తము పదిల పరచినది. చూడుడి. 3. దెయ్యాల పండుగ నాడు మేము బయట ఉంచిన చాకోలెట్టులు నింపి పెట్టిన బొచ్చెను పిల్లవాడొకడు ఎత్తుకు పోయినాడు.  ఆ బొచ్చె తస్కరణ మొత్తము మా పంచలోని కెమెరా ఒడిసి పట్టినది.  ఆ యొక్క పిల్లవాని తల్లిదండ్రులు వానిని మందలించి, మా బొచ్చెను, మీ పిల్లవాడు తి...

ఆవకాయ్‌ కాదురా! - 1

  ఇప్పుడే జాడీలోంచి ఆవకాయ తీసి కంచంలో వడ్డించుకోబోతున్నా, నువ్వొచ్చావ్‌! రా!రా!  అది ఆవకాయ కాదు, ఆర్యకాయ!  అదేంటి? ఆర్యులు తెచ్చిన ఆర్యకాయ తరువాత ఆరెకాయ, ఆరకాయ అయి  ఆ తర్వాత్తర్వాత “ర” అరిగిపోయి “వ” గా మారి “ఆవకాయ” అయింది! బానే ఉంది ఆవ పెట్టిన చరిత్ర!  సరేలే,అన్నం తింటూ మాట్లాడుకుందాం రా! అది అన్నము కాదు, ఆర్యము!  ఆర్యులు తెచ్చిన ఆర్యము —> ఆరెము —> ఆనెము —> అన్నెము —> అన్నము అయింది! మంచిదేలే!  ఇవాళ భోజనంలోకి ఆనపకాయ కూర! అదీ ఆర్యులు తెచ్చిందే.  అసలైతే అది, ఆర్యపకాయ! ఓహో, బానే ఉంది. అరిసెలు కూడా ఉన్నాయి, తిందూగానీ రా! అవి అరిసెలు కాదు, ఆర్యసెలు!  అవీ ఆర్యులు తెచ్చినవే! తెస్తే తెచ్చారులేరా, అయితే ఏమంటావ్‌ ఇప్పుడు? వాటిని మనం బహిష్కరించాలి!  ఐ హేట్‌ ఆర్యన్‌ సంస్కృతి! ఓరినీ! ఎందుకో అంత చేటు హేటు?  వాళ్ళు మనదేశం వాళ్ళు కాదు.  గుర్రాలేసుకుని ఎక్కడినించో వచ్చారు. ఓహో! మొత్తం ఆడ,మగ,పిల్లా మేకా మన దేశంలోకి వచ్చారంటావ్‌?    లేదు లేదు.  కొన్ని వేల వేల మైళ్ళు కదా, మగవాళ్ళు మాత్రమే వచ్చారు. ఓహో! వాళ్ళ వాళ్ళ భార్యాప...

కల్పననలల కథ

  నాల్గవ ప్రశ్న:  మూడు వైపులా నీరుండి నాల్గవ వైపు భూభాగము ఉన్న ప్రదేశమును ఏమందురు?   ద్వీపమా? కాదే? ద్వీపానికి అన్నివైపులా నీరుంటుందిగా?  ద్వీపంలాంటిదే ఇంకోటేదో పదం ఉంది. గుర్తొచ్చి చావడం లేదు. వెనక్కి తిరిగి వెంకోజీ పేపర్లోకి చూద్దును కదా, “పెనిన్సులా” అని సమాధానం వ్రాసి,  ఎన్ని ఆంగ్ల పదాలు తెలుగులోకి రాలేదూ? అలాగే ఇది. నోర్మూస్కుని మార్కులు వెయ్యండి. అని పక్కన బ్రాకెట్లో వ్రాసి కూర్చున్నాడు.   ఓరి వీడి తెలివి కాకులెత్తుకెళ్ళా అని తిట్టుకుని,  అచ్చ తెలుగు కవీశ్వరుల వారి శరణుజొచ్చితిని కదా,  తోక లంక పుచ్ఛపు దీవి అని వ్రాసి దర్జాగా కూచున్నాడాయన గారు! ఇదేమి తెలుగో ఏం పాడోనని, పక్కకు తిరిగి విస్కీ స్వామి ఏం వ్రాసాడో తొంగి చూడగా,  భూమికి attached దీవి లేకపోతే భూమికి చెట్టాపట్టాలేసుకున్న ద్వీపము. అసలు పదం ఏదో ఉన్నదనుకోండి, అదిప్పుడు నాకు గుర్తుకు రావడం లేదు. అయినా సగం రైటే రాసాను కాబట్టి ఫుల్‌ మార్కులు వేసెయ్యండి. ఓకేనా? ఇట్లు మీ సగోత్ర విస్కీ స్వామి.  ♥️🌷♥️ ఈ విస్కీ స్వామిని నమ్ముకుంటే మార్కులు హుళక్కేనని  ఇస్త్రీవాది ఏమైనా పనికొస్తుంద...