పోస్ట్‌లు

విందు

    జిలుగు చీరంచు ​ న   ​ వాలనీ   కలకల   ​ నవ్వులని ​ అద్దుకోనీ      బుగ్గలని   మోహాల   లేపనాలని   మసక   దీపాల   వెలుగుని దొంగిలించనీ   చూపుల   కౌగిలింతని వగలు   పోనీ         చెవి   లోలాకులని      పాటల   చెలమల్లో    తడవనీ   కాళ్ళని హొయలు   పోనీ   వేళ్ళని      ఆడనీ   ఇరుసుని   నడుముని     షాండ్లియార్ చిరు   గోళాల   చిత్ర   కాంతుల్లో     తలకెక్కనీ     జీవన   మధువుని ​ ఇంకా   ఇంకా        చుక్కా   చుక్కా .  

తెలుగు మహాభారతానికిది సహస్రాబ్ది!

  మల్లెలు తురిమిన పూలజడ తరహా పసుపు పచ్చని ఛాయ బంగారు వరహా అలతి పదముల చిత్రిక చెవినిల్లు సలహా దేశభాషా దేవతల తెలుగే అహిహా వన్నె చిన్నె పలుకుల ఊహలల అతిరుహా హాహా హూహూ జిహ్వాన అచ్చ తెనుగే అహహా! అన్ని పలుకులందు తెలుగు పలుకే మహా! మినహా! అహా! తెలుగు ఓహో! తెలుగు వహ్వా! తెలుగు తెలుగే తెలుగు! ఇరుదలపులుగు! (తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్న తెలుగు జాతికి శుభాకాంక్షలు). 💐🙏

గాలి ఈలలు వేసేనని!

మొదటి యీల తోడ ముదితను మరలించు, పిదప యీల వేసి పిల్చు త్వరగ, మరల యీల వేసి మగువను దరి జేర్చు ప్రెజరు కుక్కరెంత ప్రేమ మూర్తి! (ప్రెజరు కుక్కరెంత పెద్ద రౌడి?) — కోడూరి ఈల వేసి సంతోషపెట్టేది కుక్కరు కాక మరొకటి ఉంది. అది ఆవిరి మీద నడిచే రైలింజను. ఊటీ వెళితే అలాంటి బొమ్మ రైలు ఎక్కి ఇంచక్కా రైలు ఈలలు వినొచ్చు. నేను ఈల వేస్తే గోలకొండ అదిరిపడతది అని సినిమా వాళ్ళు ఈలను వివిధ సందర్భాల్లో బానే వాడుకుని జనాల చేత ఈలలు వేయించారు.  భావుకులకు గాలి కూడా ఈలలు వేస్తుంది,సైగ చేస్తుంది! ప్రేమలోను, విరహంలోను,విషాదంలోనూ ఈల పాట పాడుకోగల స్వేచ్ఛ మగవారికే ఎక్కువ.  ఎప్పుడైనా పాడుకోగలిగింది ఈలపాట. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు, పొలం గట్ల మీద,తోటల్లో,తోపుల్లో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు.  ఏ వయసు వారైనా ఎప్పుడైనా ఈల వేసుకుని యవ్వనాన్ని తిరిగి అనుభూతి చెందవచ్చు! 🙂

పుట్టపర్తి వారి స్మరణలో-

చిత్రం
  కళ-కళాకారులు, వీరికి లభించే ఖ్యాతి, లేక లభించని ఖ్యాతి లేక అవార్డులు వంటివి,జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మ చక్రానికి అతీతమైనవి కావు. తేలిగ్గా చెప్పాలంటే “ప్రాప్తం“. ప్రాప్తాల సంగతి పక్కన పెట్టండి. అసలు, కళామతల్లి దేవాలయంలో పూజారిత్వానికి అర్హత సాధించడం ఏ సాధకుడికైనా బహు కష్టసాధ్యం. తగినంత సాధన లేక, సాధనకు సమయం లేక,వేరే వ్యాపకాల మధ్య అప్పుడప్పుడూ కళాసాధనకు పదును పెట్టాలని ప్రయత్నిస్తూ, తుప్పును వదిలించలేక తంటాలు పడేవాళ్ళు-సాటి కళాకారులను గురించి చాడీలు,పుకార్లు చెప్పుకోవడంలో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వీళ్ళు కళామ తల్లి దేవాలయం బయట బిచ్చమెత్తుకునే భిక్షగాళ్ళు. ఇంకొక శాఖవారు ఆ వాదం,ఈ వాదం అని జెండాలెత్తి అరుస్తూ, వాటి ప్రచారం కోసం సంపాదక పీఠాలెక్కి అక్కడనించీ తస్మదీయుల మీద విమర్శలనే రాళ్ళవర్షం కురిపించే అల్లిబిత్తిరి జెఫ్ఫా భాయిలు. వీళ్ళను కళామతల్లి ఎడమకాలితో తంతుంది.  కళను కళగా ఆరాధిస్తూ,తమ జీవితాలను కళకు అర్పించిన వారికే కళామతల్లి గుడిలో అమ్మకు పూజ చేసే అవకాశం. వాళ్ళు ప్రజల మదిలో నిలుస్తారు,వారి కళ ప్రజల నాల్కల మీద నర్తిస్తుంది.  ఆ కళామతల్లి పూజరుల్లో విశ్వనాథ ఒకరు. మా ముగ్గురి...

మంచు కరిగాక-కవిత్వం

చిత్రం
  విన్నకోట రవిశంకర్‌ గారి కొత్త పుస్తకాన్ని (“మంచు కరిగాక”) పరిచయం చేసే అవకాశం నాకు కలిగింది.  

కలాభివర్ధని పరిషత్తు

చిత్రం
  ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి గౌతమీ గాథలనుండి శ్రీపాద వారి కలాభివర్ధని పరిషత్తు నిర్వహణావిశేషాలు వినండి.

మాట మంత్రమే!

  జీవితానుభవం నుండి వచ్చే మంచి సారవంతమైన మాటలు ప్రతి మనిషి నోటినించీ ఎప్పుడో అప్పుడు వెలువడతాయి ఆశ్చర్యంగా.అప్పుడవి చటుక్కున అందుకుని దాచుకుని,సందర్భం ఎదురైనప్పుడు ఆ మాటను ఒక సలహాగా జ్ఞాపకం చేసుకోవచ్చు.  విపరీతంగా దానధర్మాలు చేసి బీదరికంలోకి జారిన చిత్తూరు నాగయ్య గారు, “నా జీవితం పదిమందికి గుణపాఠం కావాలి” అనేవారట. అలా అనగలగడానికి మనిషికి ఎంత ఔన్నత్యం ఉండాలి?  ఓ ప్రముఖ నటీమణి ఓ Interview లో తన వైవాహిక జీవితం గురించి ప్రస్తావిస్తూ, “నేను కూడా నిలుపుకోలేక పోయాను” అంటే- అనుభవంలోంచి వచ్చిన ఆమె పరిణితికి అచ్చెరువొందుతూనే అయ్యో అనుకున్నాను.  కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన జీవిత చరిత్రలో తనకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిని తీవ్రముగా దూషించే బలహీనత ఉన్నదని వ్రాసుకున్నారు.  “లోధ్ర” కేసరి గారు, “ధన పిశాచమావహించి” తోటను,అందమైన బంగ్లాను అమ్మివేసితినని చింతించారు.  “ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదమ్మా” అనేది మా తాతమ్మ. భారతీయ సంస్కారం!  “ఎవ్వరి మాటలు పట్టించుకోనవసరం లేదు” అన్నారొక మిత్రులు. అది దూషణమైనా,భూషణమైనా. “తప్పొప్పులు ఎంచుకుంటూ టిక్కులు పెట్టుకుంటూ పోతే ఎవర...