పోస్ట్‌లు

అభిమాని జిందాబాద్‍!

  ఎవరండీ ఈ తొత్తు కొడుకులు? ఎవరికి జేజేలు కొట్టుకుంటూ పోతున్నారు? ట్రాఫిక్‌ ఆపేసి ఏంటండీ ఈ న్యూసెన్స్ మనకు? ఆఫీసులకు పోవాలా వద్దా?  మాటలు మర్యాదగా రానివ్వండి. నేనూ వాళ్ళల్లో ఒకడినే. మేమంతా ఫలానా హీరో అభిమానులం.  ఓహో, అలాగా. సారీ అండీ. అభిమాని అంటే ఎవరండీ?   తన అభిమానం చాటుకోవడం కోసం తనకున్న ఒక్క చొక్కా కూడా చించుకునే వాడేరా,అభిమాని అంటే! ఓహో! తన అభిమాన హీరోని ఒక్కసారైనా దగ్గర నుండి చూడాలని  ఏ చెట్టో ఎక్కి కాళ్ళు విరగ్గొట్టించుకోడానికైనా,  ఏ కరెంటు పోలో ఎక్కి షాకులు కొట్టించుకోడానికైనా సిద్ధపడేవాడేరా,అభిమాని అంటే!  ఓహో! తన అభిమాన హీరోకి  ఒక్కసారైనా షేక్‌హాండ్‌ ఇవ్వాలని  పోలీసుల చేత తన్నించుకోడానికైనా రెడీ అయ్యేవాడేరా,అభిమాని అంటే! ఓహో! తన ఇంట్లో పాలు లేకపోయినా, తన అభిమాన హీరో కటౌట్‌కి అప్పు చేసి మరీ పాలాభిషేకం చేసేవాడేరా, అభిమాని అంటే!  ఓహో! చివరికి చచ్చేటప్పుడు కూడా తన అభిమాన హీరో పేరే ఉచ్చరించే వాడేరా, అభిమాని అంటే! ఓహో, భలే బాగా చెప్పావు‌!  కానీ చివర పాయింట్‌ గురించి ఒక్క మాట, చచ్చేటప్పుడు కూడా స్మరిస్తే మళ్ళీ జన్మలో మీ హీరో గారింట్లో ఏ కుక్కగానో పుట్టాల్సి ఉంటుందేమో బాబు! మా హీరో ఇం

The hyper sensitive గృహిణి

  ఇదిగో చూడండీ, నా మనసు జున్ను ముక్కలాంటిది. ఎవరన్నా చిన్న మాటన్నా పడలేను.  కత్తితో పచక్‌ పచక్‌ మని కోత పెట్టినట్టు అయిపోతుందది. అదేనండీ,జున్ను ముక్కలాటి నా మనసు.  తట్టుకోలేను! ఒకసారి మా పెద్దన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే,  అదిగో అందరికీ మా పెద్దన్నయ్య సింగపూరు నుండి తెచ్చిన కప్పుల్లో కాఫీ ఇచ్చి, నాకు మాత్రం మామూలు మేడ్‌ ఇన్‌ అనకాపల్లి కప్పులో కాఫీ ఇచ్చింది మా పెద్ద వదిన! దాంతో నా మనసు కాగుతున్న సాంబారులా కుతకుతలాడి పోయింది. వెళ్ళి మా అన్నయ్యతో చెప్పా.  తన భార్యని మందలించాలా? కావాలని చేస్తుందా ఏమిటి? చిన్న విషయాన్ని పెద్దది చెయ్యకు అని నన్నే ఉప్మాలో కరివేపాకులా తీసిపారేసాడు. 😢 ఇది జరిగి పాతికేళ్ళవుతోంది! ఆ రోజునుండి ఈ రోజుదాకా మా పెద్దన్నయ్య గుమ్మం తొక్కలేదు నేను! అల్లాంటిదే మరో అవమానం.  పంక్తిలో  భోజనాలకి కూచున్నానా,పిండి వడియాలంటే ఇష్టమని తెలిసీ నోరు తెరిచి మారు అడిగిన నాతో,  అయిపోయాయి అక్కా! ఏమీ అనుకోకండీ! అంది, మా రెండో పిన్నత్త గారి మూడో కోడలు,కిసుక్కున నవ్వుతూ.  అది వినగానే ఆ అవమానానికి వేగిపోయిన అప్పడంలా అయిపోయింది నా హృదయం. 😢 ఇది జరిగి ఇరవై ఏళ్ళవుతోంది! ఆ రోజునుం

తెలుగు జల్లు పిలుస్తోంది,ఓటరయ్యా!

  ఓటరు మహాశయా! మా తెలుగు జల్లు పార్టీ గుర్తు “మామిడల్లం”.  మామిడల్లానికే మీ ఓటు వేసి గెలిపించ ప్రార్థన. తెలుగు జల్లా? ఎక్కడా వినలేదే? ఎప్పుడు పెట్టారీ పార్టీ? ఇవాళ పొద్దున్నే పుట్టింది.  మధ్యాహ్నం లేచి నడిచింది.  సాయంకాలానికి ఓటరు ముంగిట నిలిచింది.  ఓహో! మీ గుర్తు మామిడల్లమా? అవును.  అల్లం గుర్తుతో ఇంకో పార్టీ ఉంది.  మీరు జాగ్రత్తగా చూసి ఓటు వెయ్యాలి. సరేనా?  అల్లానికి మామిడల్లానికి తేడా రుచి చూస్తేగానీ తెలీదు కదండీ?  చూసి ఎల్లా చెప్పడం?  ఇంతకీ ఏ ఆశయంతో పార్టీ స్థాపించినట్టో? మాది తెలుగు కవుల పార్టీ.  తెలుగును రక్షించడం కోసం పెట్టాం.  అల్లం పార్టీ వాళ్ళని చూడండి. వాళ్ళకు తెలుగు రాదు.  “కనిగిరి” ని “కలిగిరి” అని పలికే వింత బాపతు.  బెల్లం పార్టీ వాళ్ళకి అసలు తెలుగే అక్కర లేదు. తెలుగు జాతి మొత్తాన్ని  బ్రిటీషు వాడి భాషలోకి, బ్రిటీషు వాడి మతంలోకి మార్చాలని జనాలను పాకం పడుతున్నారు.  బెల్లం వాళ్ళు పంచేదానికి రెండు రెట్లు పప్పు బెల్లాలుగా డబ్బు పంచుతామని అల్లం వాళ్ళు చెబుతున్నారు గదండీ?  అబ్బా, పంచడాలు,ఎంచడాలు కాదయ్యా,  ఒకడిది చచ్చు తెలుగు, ఇంకోడిది పుచ్చు తెలుగు అని చెబుతున్నా.  మరి మీది? అచ

సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 5

  హిందూ philosophy లో వ్రాసిన కర్ణాటక సంగీత కీర్తనలను abrahamic మతాలకి ఆపాదించి ఎలా పాడతావయ్యా?  పాడేస్తా నా ఇష్టం! కర్ణాటక సంగీతం ఒక్కరి సొంతం కాదు! ఎందుకు కాదు? అది హిందువుల సంగీత పద్ధతి!  వారికే సొంతం. దాన్ని కల్తీ చేసే హక్కు నీకెవరిచ్చారయ్యా? ఒకరిచ్చేదేమిటి? నేనే తీసుకున్నా!   Cultural appropriation అని విన్నావయ్యా మొద్దు కిష్నా?  అదేంటి? ముందు హేళన చేయడం, తరువాత అనుకరించడం, చివరగా కొన్నేళ్ళయ్యాక ఇది మాదే మేమే కనిపెట్టాం మీరే మమ్మల్ని అనుకరిస్తున్నారు అని ఎర్ర మేధావుల చేత చెప్పించడం!  ఇదంతా నేన్నమ్మను! హిందువులు పవిత్రంగా భావించే ప్రతి దానిలో వేలు పెట్టడం, వక్ర భాష్యాలు వ్రాయడం, అవహేళన చేయడం, మళ్ళీ ఆ పద్ధతులన్నీ తమకు నచ్చిన రీతిలో సొంతం చేసుకుని పోవడం నీకు కనిపించడం లేదుటయ్యా మొద్దు కిష్నా? ఇవన్నీ బత్తాయిల మాటలు!  I don’t care! పెద్ద కుట్రలో నువ్వొక చిన్న పరికరానివని ఎంత చెప్పినా వినవే? నీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా?  ఏమంటారు?  Useful Idiots!

సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 4

చిత్రం
  మొద్దు కిష్నా,మొద్దు కిష్నా, కర్ణాటక సంగీతం ప్రత్యేకత ఏమి? ఏమీ లేదు! అన్ని గీతాలు,సంగీతాలు అంతా ఒకటే! ఒక్కో కృతి వింటే ఆయా దేవతే ప్రత్యక్షమైనట్టు తన్మయం చెందుతారే ప్రేక్షకులు. నీకెప్పుడైనా అలా అనిపించిందా?  అదంతా హంబక్‌! నాకెప్పుడూ అలా అనిపించలా! మానసిక మ్లేచ్ఛులకి అటువంటి అనుభూతులు కలిగే అవకాశం లేదులే, మొద్దు కిష్నా! అవును, కర్ణాటక సంగీతం విని ఆనందించాలన్నా రసికత కావాలి కదా, మొద్దు కిష్నా?  అందుకే అందులో మసాలా కలిపి అందరికీ వడ్డిస్తున్నా! అలాగైతే దాని విశిష్టత కోల్పోతుంది కదయ్యా, మొద్దు కిష్నా?  విశిష్టతలు వంకాయలు ఇక్కడేమీ లేవు!  బాగు,బాగు.  నీకు సంగీతం నేర్పిన గురువులు ఎంత కుమిలి పోతున్నారోనయ్యా, మొద్దు కిష్నా!  అవునూ, బ్రామ్మిన్‌ గురువులు విదేశీయులకి కూడా సంగీతం నేర్పారుగా. దానికేమంటావ్‌?  జాన్‌ హిగ్గిన్స్ భాగవతార్‌ పేరు విన్నావా? అమెరికన్‌ కర్ణాటక సంగీత గాయకుడు! కచేరీ చేసేటప్పుడు “రామ” అని వచ్చినా “దేవా” అని వచ్చినా ఆ పదాలు వచ్చిన చోటల్లా నమస్కారాలు చేసేవాడట! నేర్పితే నేర్పి ఉండవచ్చు.  కానీ బ్రామ్మిన్‌ డామినేటింగ్‌ అంటున్నా! మరి హిందుస్తానీ సంగీతం ఎవరి డామినేటింగో చెప్పు?  హిందుస

సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 3

  మొద్దు కిష్నా, మొద్దు కిష్నా, నువ్వెందుకింత రెబెల్‌ అయ్యావ్‌? ఈ కర్ణాటక సంగీతం అంతా బ్రామ్మిన్సే! దాని మీదే నా తిరుగుబాటు! నాన్‌ బ్రామ్మిన్స్ చానామంది ఉన్నారుగా మొద్దు కిష్నా?  పురంధర దాసు, ఏసుదాసు, బెంగుళూరు నాగరత్నమ్మ ఇలా ఎంతోమంది? ఈ బ్రామ్మిన్‌ గురువులది స్వకులాభిమానం! పైన చెప్పిన వాళ్ళందరి గురువులూ బ్రామ్మిన్సేగా మొద్దు కిష్నా?  అదంతా కాదు, కర్ణాటక సంగీతం అట్టడుగు ప్రజల్లోకి వెళ్ళకుండా కుట్ర జరిగింది!  దాని మీదే నా పోరాటం!  అదే నా ఆరాటం! ఏ దేశంలోనైనా శాస్త్రీయ సంగీతానికి  ప్రేక్షకులు తక్కువ,  పాప్‌ సంగీతానికి ప్రేక్షకులు చాలా చాలా ఎక్కువ కదా, మొద్దు కిష్నా?  అందుకే శాస్త్రీయ సంగీతాన్ని వేరే వేరే సంగీతాలతో కలిపి కిచిడి చేసి ప్రజల్లోకి తీస్కెళ్తున్నా!  ఆవకాయలో చికెన్‌ బిర్యానీ కలుపుతున్నా!  ఓహో, ఇదీ కురుడియారే చెప్పాడా?  కురిడియార్‌ భక్తుడ్ని అయ్యాకే రాముడిని వదిలేసి కలి పురుషుడి ఫాలోయర్‌ అయ్యా!  ఓహో, అప్పట్నించీ నీ నెత్తిన దెయ్యం ఆడ్డం మొదలైనట్టుంది! దెయ్యం ఏమిటి? దెయ్యం?  ఆ తర్వాతే నాకు రోమన్‌ తోసేసెయ్‌ అవార్డు వచ్చింది‌, తెలుసా?  వామ్మో, ఈ అవార్డు తీస్కున్న వాళ్ళంతా ఆ తర్వాత మటా

సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 2

  మొద్దు కిష్నా, మొద్దు కిష్నా, కర్ణాటక సంగీతమంటే ఏమిటి?  రాగాలు, ఆలాపనలు,technicalities,talent అంతే! మరి భావం, భక్తి,సాహిత్యం? భక్తి గిక్తీ ఏమీ లేదు! మరి త్యాగరాజు,పురంధర దాసు వీళ్ళంతా?  అంతా ట్రాష్‌! అసలు కర్ణాటక సంగీతానికి మతానికీ సంబంధం లేదు! సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గము గలదే  అన్నాడే త్యాగయ్య? నువ్వు భక్తిని పక్కన పెట్టి కేవలం technicalities, చమక్కులు ప్రదర్శిస్తే ఆ కీర్తనల పవిత్రత పోదూ?  పవిత్రత గాడిద గుడ్డు ఏమీ లేదు! కర్ణాటక సంగీతం, సాహిత్యం సనాతన సంస్కృతికి చెందినవి. నాదోపాసనతో భగవంతుని చేరుకోవచ్చుననే విశ్వాసంతో భక్తితో నేర్చుకుని ఆలపించేవి, అన్నీ హిందూ దేవీ దేవతల మీద వ్రాసిన కీర్తనలే కదయ్యా, మొద్దు కిష్నా? మతానికి కర్ణాటక సంగీతానికి సంబంధం లేదు.  నేనింకనించీ రోజుకి రెండు కీర్తనలు వేరే మతాల దేవుళ్ళ మీద రాసి త్యాగరాయ కృతుల బాణీలో పాడతా! ఇదే నా ఛాలెంజ్‌!  బస్తీ మే సవాల్‌!   బాగుందయ్యా,మొద్దు కిష్నా!  ఓ పని చెయ్యి, వేరే మతంలోకి మారి అప్పుడు రాముడి మీద, కృష్ణుడి మీద,శివుడి మీద కృతులు రాసి పాడి చూడు. సరేనా?  నేను ఏ మతాన్ని ఫాలో అవను కానీ హిందూ మతాన్ని వ్యతిరేకిస్తా! నాదంతా కుర