పోస్ట్‌లు

సెప్టెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

కచటతపలకు గసడదవలు!

  వెంకట లక్ష్మి: మీ కథలో ఒకచోట “కూరకాయలు” అని వ్రాసారేమిటండీ? రచయిత: అది కూరలు+కాయలు. ద్వంద్వ సమాసము. అది అలాగే వస్తుంది. మీకు వ్యాకరణము అదీ తెలియదనుకుంటా. పరవాలేదు, ఇంటికెళ్ళి నేను వ్రాసిన వ్యాకరణ వాక్కాయ చదువుకోండి.  అభిమాని అంధారావు: ఆహా! ఎంత బాగా చెప్పారండీ గురువు గారూ! వెంకట లక్ష్మి:  కూరకాయలు ఎలా అవుతుందండీ? కూరగాయలు కానీ కాయగూరలు కానీ అనాలి గానీ?     రచయిత: కాయగూరలు వేరు. కూరగాయలు వేరు. కాయల్ని వండితే కూర అవుతాయి, అవి కాయగూరలు. కూర వండడానికి వాడేవి కాయలు. కాబట్టి అవి కూరగాయలు. కానీ, కాయకూరలు అనడమే రైటు.  అభిమాని అంధారావు: ఆహా! ఎంత బాగా చెప్పారండీ గురువు గారూ! మా గురువు గారికి నాలుగు పీహెచ్చిడీలు, వారి ఖాతాలో వంద పరిశోధనా పత్రాలు ఉన్నాయి. వారి పరిజ్ఞానాన్నే ప్రశ్నిస్తారా? ఎంత ధైర్యం? వెంకట లక్ష్మి: అది కాదండీ, ద్వంద్వ సమాసములో రెండవ పదం కచటతపలు గసడదవలుగా మారతాయి కదా? కూరగాయలు,కాయగూరలు రెండిటి అర్థం ఒకటేనండీ! కుటుంబ రావు: కూరగాయలు రైటా కాయగూరలు రైటా అని మగాళ్ళం మేమే చెప్పలేక పోతున్నాం. నీకెందుకమ్మా ఇవన్నీ? హాయిగా ఇంటికెళ్ళి కూరగాయలతో కాయగూరలు చేసుకోక?  అధిక ప్రసంగి సుబ్బారావు: మేడ

ఈ దరిని ఆ దరిని దుఃఖదాయిని

  మా నాయకుడు పడవల్లో తిరిగి వరదబాధితులను  పరామార్శిస్తున్నాడు, చూసావా?  అదీ లీడర్‌షిప్పంటే!  అబ్బో, నిజమే! అందరికీ పులిహోర పాకెట్లు, పెరుగన్నం పాకెట్లు  పంచుతున్నారు, చూసావా?  అదీ మనోళ్ళలో మంచితనమంటే! అబ్బా‌! నిజమే! అదిగాదన్నాయ్‌,  మరి అసలికీ వరదలే రాకుండా చెయ్యొచ్చు కదన్నాయ్‌? ఓరి పిచ్చోడా!  వరదలు చైనాలో వత్తయ్‌‌!  జపాన్‌లో వత్తయ్‌!  అస్సాంలో వత్తయ్‌!  ఆస్ట్రేలియాలో వత్తయ్‌!  మన్దసలికే కోస్టల్‌ ఏరియా! రాకుండెట్టుంటయ్‌? అదిగాదన్నాయ్‌, ఆ ఏరు పొంగిందంటగా?  ఆ,పొంగితే?  ఏరన్నాక వరదలకి పొంగకుండుండిద్దా? అదిగాదన్నాయ్‌, ఆ ఏరు సగం నదిలోను, సగం చెఱువులోను కలుసుద్దంటగా? అయితే?  నదిలోకి పోయే దారి సరింగా కట్టలేదంట!  చెఱువులోకి పోయే తోవంతా బొక్కలున్నాయంట! కాలవంతా చెత్తంట! అయితే?  ఏరు ఆక్రమించి ఇళ్ళు కట్టేసేరంట! చెరువును ఆక్రమించి ఇళ్ళు కట్టేసేరంట! దిక్కుతోచక ఏరు పొంగి ఊళ్ళోకి వచ్చేసిందంట!  అయితే ఏమంటావ్‌ ఇప్పుడు? శాస్విత పరిష్కారం చూడాల గదా అన్నాయ్‌! రే, నువ్వేమన్నా రాజికీయ నాయకుడివా?  శాస్విత పరిష్కారాలని న్యూస్‌ పేపరు మాటలు చెబున్నావ్‌?  వరదొచ్చిందా, పరామార్శించామా, పులిహోర పంచామా ఇదేరా జనం చూసేద