అవార్డులొచ్చే కవిత్వం రాయడం ఎలా? - 2
ఈ టూత్‌బ్రష్ కవిత్వం రాసి అవార్డులు సంపాదించాలా? నావల్ల కాదురా! సరే, అది వదిలి పెట్టు. సామాజిక అంశాలు కొన్ని వేడి వేడి టాపిక్స్ ఉన్నాయి. అవి ప్రయత్నించు. అవార్డులు గ్యారెంటీ. ఓకే? అతడిని ఫాలో అయ్యాకే పురాతన అక్షి పోయి మోక్షం మొలుచుకొచ్చింది పునర్జన్మ పిలకలెత్తింది అతడిని ఫాలో అయ్యాకే అహింస నాలో పేట్రేగింది అతడే నాకు ముక్తిదాత అతడే అతడే నా విధాత! ఈ ఫక్కీలో రాసి చూడు. అవార్డు రాకపోతే నన్నడుగు. ఎవరా అతడు?? బుద్ధుడు. అంటే తెలీకడుగుతా, బుద్ధుడిని ఫాలో అయ్యాక వీళ్ళంతా వెజిటేరియన్లు అయిపోయారారా? యజ్ఞాల్లో పశుబలి, జాతరల్లో జంతు బలి హింస. అదే ఇంట్లోనో, హోటెల్లోనో కోసి వండి ప్లేట్లో పెడితే అది హింస కాదు. ఓకే? క్లారిటీ వచ్చిందా? సరేరా. తెలీకడుగుతా, మరి బుద్ధుడు అహింస చెప్పాడు కదా, ఆయన వెజిటేరియనేనా? ఒరేయ్, అవార్డులు తెచ్చుకునే ఐడియాలు చెబుతుంటే రెటమతం ప్రశ్నలు వేస్తావే? బుద్ధుడు ధిక్కార స్వరానికి ప్రతీకన్న మాట. అర్థమైందా? కావాలంటే రాముడిని ప్రశ్నిస్తూ కవిత్వం రాయి. నీకు అవార్డులే అవార్డులు. అమ్మో! అవునా? ఎలా? నీకు అవార్డులిచ్చే వ...