అవార్డులొచ్చే కవిత్వం రాయడం ఎలా? - 4
ఇంత చాదస్తంతో నువ్వు నానావాదాల కవిత్వం ఏం రాస్తావ్? సెక్యులర్ కవిత్వం రాసి జనాలను ఎలా మానేజ్ చేస్తావ్? ఓ పని చెయ్, నీలాంటి చాదస్తులకు అవార్డులు తెచ్చుకోగల మరో మంచి ఉపాయం ఉంది. అదేంటంటే, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కవిత్వరూపాలను కాచ్ చేసి కాష్ చేసుకోవడం. చెత్త మీద వాలిన ఈగ మనసు ఇలా రాయాలి. బావుందా? ఒక ముక్కే చెప్పి బావుందా అంటావే? ఇంకా చెప్పు. ఇంతే కవిత. వీటిని మిడ్డీలంటారు. మిడ్డీలా?? మినీ కవితలు. ఇంకో మిడ్డీ చూడు- కోతికి కొబ్బరి చిప్ప సెల్ ఫోన్ బావుందా? నిగూఢమైన అర్థం, అతి తక్కువ మాటల్లో. ఇది చూడు- కాకికి కాకే! ఇదేమిటి? ఇందాకటిదానికన్నా చిన్నగా ఉంది? వీటిని చెడ్డీలంటారు. చిట్టి కవితలన్న మాట. కన్నుకి కన్నా? ఇలాగన్న మాట. అల్పాక్షరాలలో అనంతార్థం! అవార్డులే అవార్డులు! బాబోయ్, నీ అవార్డులకో నమస్కారం. నన్నొదిలి పెట్టు. ఓకే, మిడ్డీలు, చెడ్డీలు వద్దంటున్నావ్ కాబట్టి దీర్ఘ కవిత ట్ర్రై చెయ్. గత పదేళ్ళుగా వచ్చిన వార్తాపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు తీసుకుని గుదిగుచ్చావంటే దీర్ఘ కవిత తయారు! ఏదో భోజనం త...