షీలా కీ జవానీ!
పెళ్ళి కాని ప్రకాష్ అమిరికాలో సాఫ్ట్వేర్ కూలీ ఉద్యోగం చేస్తూ రోజులు దొర్లిస్తున్నాడు. ఎప్పటివలె అతడొక రోజు భడేల్ బ్రదర్స్ కి కూరలు కొనడానికి వెళ్ళాడు. అతగాడు కూరలు కొంటున్నంతసేపూ, My name is షీలా! షీలాకి జవానీ! అన్న పాట పాడిందే పాటగా వినిపించింది. కూరలు కొని కారెక్కి విదేశీ దేశీ రేడియో ఆన్ చెయ్యగానే, My name is షీలా! షీలాకి జవానీ! అన్న పాటను ఆ రేడియో మారుమోగుతోంది. ఆ తర్వాత బిర్యానీ దొరుకుతుందని, దేశీ దివాలీ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ డించక్ డించక్ డీజేలో, My name is షీలా! షీలాకి జవానీ! అన్న పాటకు ఆంటీస్ & అంకుల్స్, బాయ్స్ & గరల్స్ డాన్సాడుతుంటే తనకొచ్చిన ఒక్క తీన్‌మార్ స్టెప్పు వేసి, బిర్యానీ తిని ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఆదివారం కావుటచే స్థానిక తెలుగు కార్యక్రమానికి హాజరై నాడు. అందులో మళ్ళీ, My name is షీలా! షీలాకి జవానీ! అన్న పాటకు ఔత్సాహికులు నృత్య ప్రదర్శన ఇవ్వగా అది చూసి తరించి ఇంటికి వస్తుండగా, మళ్ళీ కారులో, My name is షీలా! షీలాకి జవానీ! అన్న పాట వెంటబ...