పోస్ట్‌లు

జూన్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీ శ్రీ చంద్ర చెకోడీ

  గగనమంతా నిండి  పొగలాగు క్రమ్మి, బహుళ పంచమి జ్యోత్స్న  భయపెట్టు నన్ను! కవిత బానే ఉంది. వెన్నెల పొగలాగా కమ్మడం ఏమిటో  విచిత్రం! వెన్నెల భూమి మీదకు కురుస్తుందిగానీ ఆకాశమంతా నిండడం అదేమిటో చూసావుటయ్యా చోద్యం?  ఆకాశపుటెడారి  అంతటా, అకట! ఈ రేయి రేగింది  ఇసుక తుపాను! తెలుగు నాట ఎడారులున్నవా? ఆకాశం ఎడారిలాగా ఉందిట! ఆ ఎడారిలో “ఇసుక” తుఫాను రేగిందిట! అంటే ఆకాశంలో ఇసుక తుఫాను! అవకాశం ఉందా?  గాలిలో కానరాని  గడుసు దయ్యాలు భూ దివమ్ముల మధ్య  ఈదుతున్నాయి! రవిగాంచని చో కవిగాంచునని ఊరికే అన్నారా? ఎవరికీ కనిపించని గడుసు దయ్యాలు కవిగారికి కనిపించాయి. అవి భూ దివమ్ముల మధ్య “ఈదుతున్నాయి”ట! దెయ్యాలు గాలిలో హాయిగా ఎగిరిపోతాయని విన్నాంగానీ ఇలా కష్టపడి ఈదుతాయని ఇంతవరకూ తెలవదు సుమీ!  నోరెత్తి, హోరెత్తి  నొగులు సాగరము! కరి కళేబరములా  కదలదు కొండ! ఆకాశపు టెడారి లో, కాళ్లు తెగిన ఒంటరి ఒంటెలా గుంది జాబిల్లి! పర్వతాలు, కొండలు ఏనుగులులాగా ఉన్నవని పోల్చడం మన సాంప్రదాయం. కానీ కవిగారు వాటిని చచ్చిన ఏనుగుతో పోల్చి పోయారు పాపం. ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అన్నారు కనుక ఆలాగున సరి పెట్టుకొమ్మని కవిగారి కరి కిరికిరి క

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।

  సభ కిటకిటలాడుతోంది అక్కడ.  చిఱుతప్రాయపు కుఱ్ఱవాడొకడు, నిండా పదహారేండ్లు లేవతనికి.  అవధానిగా రంగప్రవేశం చేసి పృచ్ఛకులను నిరుత్తరులను చేసిపారేస్తున్నాడు. శెహభాష్‌ అనిపించుకుంటూ ఉన్నాడు ప్రేక్షకులతో, కరతాళ ధ్వనులు అలలలుగా పైకి లేస్తుండగా. అవధాన సీమలో వ్యాఘ్రంలాగా సంచరిస్తూ చెలరేగుతున్నాడు.   అవధాని గారికి మంచి పిల్లను వెతికి పెడతాం, తాళి కడతారా అన్నాడు అప్రస్తుత ప్రసంగి.  అవధాని గారి పద్యం అమ్మాయి నడకలాగా ఉందని చమత్కరించాడో  పృచ్ఛకుడు. అవధాని గారు నరసింహుడినే కాదు, ఆయన ఒళ్ళో కూచున్న లక్ష్మిని కూడా చూడాలని ముసిముసి నవ్వులు నవ్వాడు మరో పృచ్ఛకుడు.  యువ అవధాని వలపుల మీద, వివాహం మీద అనేకానేక ఛలోక్తులతో అవధానం ఆహ్లాదకరంగా సాగింది.  విజయవంతంగా ముగిసిపోయింది కూడాను.  ఇంతలో ఎక్కడనుండి వచ్చాడో ఓ వృద్ధుడు, నుదుటిని  త్రిపుండ్రాలు,  చెవులకు బంగారు దిద్దులు, మెడలో రుద్రాక్షలు,పచ్చని మేనిఛాయ.  ఆశీస్సులు నీకు బాబూ, ఆ సరస్వతీ దేవి కటాక్షం నీకుంది. అద్భుతంగా వచ్చాయి పూరణలు! అయితే బాబూ, ఒక్క విషయం. ఇక్కడ నీ మీద ఛలోక్తులాడిన పృచ్ఛకులున్నారే, వారూ ఒకప్పుడు నీలాగే గొప్ప మేధోసంపత్తితో మహోత్సాహంతో సాహితీ రంగం

మెలిక శ కుంటిన కథ

  రెండవ ప్రశ్న:  Helmet అను ఆంగ్ల పదమునకు సరియైన తెలుగు పదమును సూచించుము.  అరెరే,ఇది నాకు తెలిసిన పదమే! సమయానికి గుర్తొచ్చి చావడం లేదని ఏదైనా హింటు దొరుకుతుందేమోనని వెనక్కి తిరిగి వెంకోజీ పేపర్లోకి చూసా.  “హెల్మెట్టు” అని రాసి ధీమాగా కూచున్నాడు వెంకో. హెల్మెట్టు, కందట్టు,ఆమ్లెట్టు ఏంటో వీడి బొంద తెలుగు అనుకుంటూ జెప్ఫాభాయి పేపరులోకి చూసా.  “తల్కి ఇన్ప టోపీ” అని రాసి ఈ పేటకు నేనే మేస్తిరీ టైపులో కూచున్నాడు.  ఓరి వీడి తెలుగు తగలెయ్యా అనుకుంటూ మనకు అచ్చ తెలుగు కవీశ్వరులైతే మంచి సహాయమౌతుందని ఉపాయంగా ఆలోచించి, మెడ కొంచెం బారసాచి వారి పేపరులోకి తొంగి చూద్దును కదా, “డిప్పకాయ డొప్ప”  లేక  “తలకాయ గురుగు ముంత”  లేక  “డిప్ప తపేలా”   ఇంకనూ అచ్చ తెలుగు కూతలు వలసిన వారి మేలు తలపుల కొరకు నా  కూత పెట్టె అంకె: 123-123-1234. తల్లి విన్కి చున్కి మాటలు కన్కి అచ్చ తెనుగు మన కలుగు వెలుగు మలుగు నలుగు. మంగిడీలు.🙏  అమ్మోయ్, ఇది మనకు పనికొచ్చే తెలుగు కాదని వీరంగం స్వామి పేపరులోకి చూద్దును కదా, “శిర్‌ కీ దావత్‌వాలీ భాండీ” or “తల్కాయ్‌ భాండీ”  అని రాసేసి అందరివంకా నిప్పులు కురిపిస్తున్నాడు.  పోనీ, వాదకవి కంది గిం

ధ పొట్టలో చుక్క కథ

  అప్పనంగా వచ్చిపడుతున్న తెలుగు భాషాప్రవీణ డిగ్రీ ఒకటి జేబులో వేసుకుందామని చాలామంది క్రౌంచద్వీప కవులు, రచయితలు ఈమధ్య పెన్నులు,అట్టలు పుచ్చుకుని ప్రవేశ పరీక్షకు బయల్దేరారు.  వాళ్ళల్లో నేనూ ఒకడిని.  యాభై ఏళ్ళుగా సాహిత్యాన్ని వేయిస్తున్నా. ఇంకా వేగవలసింది చాలా ఉంది. అంచేత తెలుగులో ఓ డిగ్రీ కూడా ఉంటే అలంకారప్రాయంగా ఉంటుందని బయల్దేరా.  తీరా పరీక్ష హాల్లో చూస్తే నా బెంచీ చుట్టూ నాకు తెలిసిన వాళ్ళే!  ఇదేదో భలే భలేగా బావుందే! ఇంక విందుగా పసందుగా పరీక్ష పాసైపోవచ్చనుకున్నా.  మొదటి ప్రశ్న:  First Literary meeting అన్న ఆంగ్ల పదాన్ని తెలుగులో వ్రాయుము.  ఓస్‌,ఇంతే కదా, నా సుదీర్ఘ సాహితీ జీవితంలో ఎన్నెన్ని మీటింగులెట్టలేదూ? అనుకుంటూ జవాబు రాసి పారేసా.  “ప్రధమ సాహితీ సమావేశం”  ఇంతలో గొప్ప అనుమానం వచ్చిపడింది. “ప్రధమ” నా? లేకపోతే “ప్రథమ” నా? పొట్టలో చుక్క ఉందా లేదా అని!  నా వెనక బెంచీలో నా సీనియరు వెవ్వెవ్వే వెంకోజీ పేపర్లో కాపీ కొడదామని వెనక్కి తిరిగి చూసా.  “మొదటి లిటరరీ మీటింగు” అని ఉంది! అది చూసి డంగయ్యా! అవునూ నేను కూడా “మొదటి” అని రాయెచ్చుగా? ప్రధమ కోసం పాకులాడే బదులు? అని అనుకునేలోగా పరీక్షకుడు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 6

  ఏమో రా, ఎన్నెన్నో మంచి కథలు రాసా.  ఒక్క కథా అచ్చు కాలేదే అని దిగులుగా ఉంది. దిగులు పడకురా! నీకు అన్నీ ఉన్నాయ్‌, ఒక్క అభ్యుదయం తప్ప. ప్రగతిశీలత కూడా మిస్సవుతున్నావ్‌. అంతే.  నేనున్నాగా నీకు అభ్యుదయ ఐడియాలిచ్చే పాపాల భైరవుడ్ని!  డోంట్‌ వర్రీ!  ముందు మనం పాతదంతా రోత అని తీర్మానించాలి! ఓకే? ఎందుకూ? అప్పుడే అభ్యుదయం! సరేనా?  అన్నింటినీ ప్రశ్నించాలి! ఓకే?  అన్నిటినీ అంటే అన్నిటినీ అనుకునేవ్‌! కొంపలు మునుగుతాయ్‌!  Only హిందూ ఆచారాలను ప్రశ్నించాలి. ఓకే? సంధ్యావందనం చేసేవాడికన్నా సారాయి తాగేవాడు గొప్ప వాడని రాయాలి. ఓకే? ఇంకా.. ఆపరా రేయ్‌, అసలెందుకు రాయాలిరా ఇవన్నీ?? ఇవన్నీ అభ్యుదయ కథలకు ముడి సరుకులు! అవార్డులొచ్చే కథలకు ఇదే ఆవపిండి!  నా పిండాకూడు! నువ్వూ నీ వెధవ ఐడియాలునూ!  అజ్ఞానం చేత నువ్వల్లా మాట్లాడుతున్నావని నాకు తెలుసు రా!  ఇప్పుడొక అద్భుతమైన ముడి సరుకు ఇస్తా. విను.  ఇంకో ముఖ్య విషయం, అభ్యుదయ కథల్లో ఏది చెప్పినా సున్నితంగా, నచ్చ చెప్పేలా, ఎంత కరుడు గట్టిన సంప్రదాయవాదికైనా నిజమే కదా అనిపించేలా చెప్పాలి. ఈ ఒక్క సూత్రం బాగా మెమొరీలో వేస్కో. ఓకే?  ఇప్పుడు కథలోకి వద్దాం.  మనం ప్రతి సంప్రదాయా

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5

  ప్రగతిశీల పాప్‌స్టార్‌ అవ్వాలని నాకేం కోరికలు లేవుగానీ,  ఇంకేమైనా కాస్త సున్నితంగా ఉండే ఐడియాలు చెప్పరా,బాబూ!  ఇందుకనే రా, జబ్బలు వాచేలా కథల మీద కథలు రాస్తూ పోయావ్‌‌ గానీ నీకు ఒక్క కథా ప్రచురణకు పోలేదు! ఓకే. సరే, ఒక మంచి ఐడియా ఇస్తా, విను.  నీలాంటి అప్‌కమింగ్‌‌ అభ్యుదయ రచైతకి సరిపోతుంది. అనగనగా ఒక ఆధునిక అభ్యుదయ లేడీ.  సాఫ్ట్వేర్‌ ఉద్యోగం చేస్తూ ఉంటుంది.  ఆవిడ సహచరుడు డాలర్ల కోసం దేశాలు పట్టిపోయి ఉంటాడు.  సహచరుడు అంటే Boy friend?  కాదు. జీవన సహచరుడు. ఓ! అలా చెప్పు. మొగుడా?  మొగుళ్ళు,మొద్దులు సంప్రదాయ స్త్రీలకు ఉంటారు. అభ్యుదయ స్త్రీలకు సహచరుడు ఉంటాడు. తెలిసిందా? ఇద్దరికీ తేడా ఏమిటో?  అభ్యుదయ నిఘంటువు ప్రకారం, సహచరుడు సాటి రైలు ప్రయాణీకుడులాంటి వాడు.  మొగుడు అనేవాడు ఒక గుదిబండ.  తెలిసిందా?  ఎలా? మొగుడు అనే జీవి కుటుంబ గౌరవం, కుటుంబ సాంప్రదాయం, ఆచారాలు,కట్టుబాట్లులాంటి తట్టెడు పితృస్వామ్య బాగేజీతో వస్తాడు. అదే సహచరుడైతే, ఇంచక్కా చేతులూపుకుంటూ వచ్చి , మనతోపాటు ఇంచక్కా సాయిలాపాయిలాగా, ఇంచక్కా మనం ఎలా చెబితే అలా వింటూ ఇంచక్కా ఉంటాడు.  తెలిసిందా?  బాబోయ్‌! నాకంతా కొత్తగా ఉందీ టెర్మినాలజీ!